కిరణ్ 24×7 న్యూస్ :రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటుకు అప్పజెబుతూ కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తక్షణం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 28న తలపెట్టిన `వైఎస్ఆర్సీపీ ప్రజా ఉద్యమం కార్యక్రమం పోస్టర్‌ను కుడా *మాజీ చైర్మన్ కోడుమూరు నియోజకవర్గ సమన్వయకర్త రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యులు కోట్ల హర్షవర్ధన్ రెడ్డి* ఆదేశం మేరకు కోడుమూరు మండల కేంద్రంలో *వైఎస్ఆర్సీపీ కోడుమూరు నియోజకవర్గ ఇంచార్జి డాక్టర్ ఆదిమూలపు సతీష్* పోస్టర్ ఆవిష్కరించారు. శుక్రవారం కోడుమూరులోని పార్టీ కార్యాలయం ` వైఎస్ఆర్సీపీ ప్రజా ఉద్యమం కార్యక్రమంపై సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా *డాక్టర్ ఆదిమూలపు సతీష్* మాట్లాడుతూ..మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రస్తుతం పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న కోటి సంతకాల సేకరణతోపాటు ఈనెల 28న నియోజకవర్గ కేంద్రం కోడుమూరులో అవగాహన ర్యాలీ నిర్వహించనున్ననట్టు వివరించారు. నవంబర్ 24 నాటికి సంతకాల సేకరణ పూర్తవుతుందని, ఆ సంతకాల ప్రతులను మాజీ సీఎం వైఎస్ జగన్ పార్టీ నాయకులతో కలిసి వెళ్లి రాష్ట్ర గవర్నర్‌కి అందజేస్తారని తెలిపారు.






