కర్నూలు, స్పోర్ట్స్ న్యూస్: కర్నూలు నగరంలో నంద్యాల చెక్పోస్ట్ దగ్గర ఉన్న గుడ్ షెఫర్డ్ పాఠశాల క్రీడా ఆవరణ లో 19 ఏళ్ల లోపు కర్నూలు జిల్లా టెన్ని కోయిట్ జట్ల ఎంపికలు నిర్వహించగా ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గుడ్ షెఫర్డ్ పాఠశాల కరస్పాండెంట్ ఏసుదాసు హాజరై క్రీడాకారులను పరిచయం చేసుకొని అనంతరం వారిని ఉద్దేశించి ప్రసంగిస్తూ చిన్నప్పటి నుంచి క్రీడల సాధన చేయడం అలవాటు చేసుకోవాలని వ్యాయామం తప్పనిసరిగా మన జీవితంలో దిన చర్య కావాలని తెలిపారు. అత్యుత్తమ క్రీడా ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు నేరుగా ఉద్యోగాలు కల్పించే వెసలు బాటుని దాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఎంపికైన క్రీడాకారులు బాపట్ల జిల్లా చీరాల పట్టణంలో నవంబర్ 7 నుంచి 9 వరకు జరగబోయే రాష్ట్రస్థాయి అంతర్ జిల్లాల జూనియర్ టెన్ని కోయిట్ పోటీలలో కర్నూలు జిల్లా జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తారని తెలిపారు ఈ కార్యక్రమంలో గుడ్ షెఫర్డ్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు నరహరి, కో ఆర్డినేటర్ సోనియా, ఆంధ్ర ప్రదేశ్ షూటింగ్ బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పరుశ రాముడు, వ్యాయామ ఉపాధ్యాయులు సురేష్ కుమార్ , మధుసూదన్ , మహేష్ , సురేష్ తదితరులు పాల్గొన్నారు.






