తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ,ఐటీ విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ బాబు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు  శ్రీనివాసరావు కోడుమూరు నియోజకవర్గ శాసనసభ్యులు. బొగుల దస్తగిరి , కర్నూలు కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ .డి. విష్ణువర్ధన్ రెడ్డి ఆదేశాల మేరకు కోడుమూరు నియోజకవర్గం, గూడూరు మండలం,పొన్నకల్లు గ్రామంలో పేదల సేవలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల కన్వీనర్ జె.సురేష్ పాల్గొని ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అందజేశారు.వారు మాట్లాడుతూ వృద్ధులు వితంతువులకు 4000 రూపాయలు, దివ్యాంగులకు, వ్యాధిగ్రస్తులకు 5000 రూపాయలు,కిడ్నీ, కాలేయము, తల సేమియా బాధితులకు 10000 రూపాయలు, పూర్తి వైకల్యం ఉన్నవారికి 15000 రూపాయలను ప్రతినెల ఒకటో తేదీన ఇస్తున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని కొనియాడారు.ముఖ్యమంత్రివర్యులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామన్నారు ఈ కార్యక్రమంలో బూత్ ఇన్చార్జిలు రాజేష్, రాజు, సచివాల సిబ్బంది పాల్గొనడం జరిగింది.