కొవ్వొత్తులతో నిరసన తెలిపిన వైసిపి నేతలు
కర్నూలు (కిరణ్24×7 న్యూస్)
కోడుమూరు నియోజకవర్గ లో కర్నూలు 40వ వార్డులో కొవ్వొత్తుల ప్రదర్శన..
శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వేంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాట ఘటన పూర్తిగా నిఘా వైఫల్యమేనని.. దీనికి ప్రభు త్వ హత్యలుగానే భావిస్తున్నామంటూ వైఎస్ఆర్‌సీపీ కోడుమూరు నియోజకవర్గ ఇన్‌చార్జ్ డాక్టర్ ఆదిమూలపు సతీష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరఫున రూ.25 లక్షల పరిహారం, ఒక్కో ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వాలడి డిమాండ్ చేశారు. కాశీబుగ్గ తొక్కిసలాటలో మృతి చెందిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని, సోమవారం రాత్రి వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు.
కర్నూలు 40వ వార్డు కార్పొరేటర్, స్టాండింగ్ కమిటీ సభ్యులు విక్రమ్ సింహరెడ్డి ఆధ్వర్యంలో కుడా మాజీ చైర్మన్ కోడుమూరు నియోజకవర్గ సమన్వయకర్త రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యులు కోట్ల హర్షవర్ధన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ఆదిమూలపు సతీష్ పాల్గొని కూటమి ప్రభుత్వ తీరును ఎండగట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏకాదశి పురస్కరించుకుని ఆలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తా రని ఆలయ ధర్మకర్త పోలీసులకు ముందే సమాచారం ఇచ్చినట్లు మీడియాకు తెలిపారని.. అయినా నిఘా కొరవడటంతో అమాయకులైన భక్తులు మృతి చెందారన్నారు. తిరుపతి, సింహాచలం హిందూ ఆలయాల వద్ద జరిగిన తొక్కిసలాట.. భక్తుల మృతి మరువక మునుపే మరో ఘటన జరగడం దురదృష్టకరమన్నారు.
హిందూ ఆలయాలపై ప్రభుత్వ నిర్లక్ష్యధోరణికి అమాయకులైన భక్తులు ప్రాణాలు బలిగొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కాశీబుగ్గ ఘటన నుంచి ప్రజల్ని డైవర్ట్ చేయడానికి నకిలీమద్యం కేసులో సంబంధం లేకున్నా మాజీ మంత్రి జోగి రమేష్‌ను అరెస్టు చేశారన్నారు. నకిలీ మద్యం కేసు సీబీఐకు అప్పగించాలని హైకోర్టులో పిటిషన్ వేసిన వెంటనే ప్రభుత్వం ఇలాంటి చర్యలకు దిగడం దుర్మార్గమన్నారు.ఈ కార్యక్రమంలో కర్నూలు వైస్ ఎంపీపీ నెహెమియా, గూడూరు జడ్పిటిసి మౌలాలి, జిల్లా కార్యదర్శి కొంతలపాడు శ్రీనివాస రెడ్డి, ముడుమలగుర్తి శ్రీనివాస రెడ్డి, మండల కన్వీనర్ పేర పోగు మోహన్ బాబు కోడుమూరు నియోజకవర్గ ఎస్ సీ సెల్ అధ్యక్షులు బొజ్జన్న, సోషల్ మీడియా విభాగం అధ్యక్షులు గిరి ప్రసాద్, దత్తు, ప్రసాద్ , బోయ వెంకటేష్, ప్రభు దాస్, శేషన్న, రామరాజు, మహేంద్ర , నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.






