కిరణ్ 24×7 న్యూస్: గూడూరు నగరపంచాయతి లో చిన్న పాటి వర్షాలకు 1 వ వార్డు లో వర్షపు నీరు ఇంట్లో కి చేరి సమస్య కావడంతో కాలనీ ప్రజలు టీడీపీ నాయకుడు సృజన్ కి సమాచారం ఇవ్వడం ఆయన స్పందించి కాలనీ లోని పరిస్థితులను కే డి సి సి చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి దృష్టికి తీసుకొని పోవడంతో ఆయన వెంటనే స్పందించి మున్సిపల్ కమిషనర్ కు ఆదేశాలు ఇచ్చారు.
కాలనీలో నెలకొని ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. విష్ణు వర్ధన్ రెడ్డి ఆదేశాలతో వెంటనే జేసీబీ తో కాలనీ లో కాలువలు ఏర్పాటు చేసి వర్షపు నీటిని మొత్తం తొలగించారు. ఎస్సీ కాలనీ ప్రజల ఎన్నో సంవత్సరాల సమస్యను 4 రోజుల్లో తీర్చిన కె డీసీసీ చైర్మన్ విష్ణు వర్ధన్ రెడ్డి రికి కృతజ్ఞతలు తెలియజేశారు.






