కోడుమూరులో ప్రైవేటీకరణపై భారీగా నిర‌స‌న ర్యాలీ

కిరణ్ 24×7 న్యూస్:

భారీగా త‌ర‌లివ‌చ్చిన వైఎస్ఆర్‌సీపీ శ్రేణులు..

మెడిక‌ల్ కాలేజీల ప్రైవేటీక‌ర‌ణ‌ను అడ్డుకుంటామ‌ని కోట్ల హ‌ర్ష‌వ‌ర్ధ‌న్‌రెడ్డి, డాక్ట‌ర్ ఆదిమూల‌పు స‌తీష్ హెచ్చ‌రిక‌..

ప్రభుత్వ కొత్త వైద్య కళాశాలల ప్రైవేటీకరణను నిరసిస్తూ బుధవారం కోడుమూరులో వైఎస్ఆర్‌సీపీ తలపెట్టిన నిరసన ర్యాలీలో ప్ర‌జ‌లు, పార్టీ కార్య‌క‌ర్త‌లు, విద్యార్థులు, తల్లిదండ్రులు, ప్రజాసంఘాలు, మేథావులు సామాజిక కార్యకర్తలు క‌దంతొక్కారు. వైఎస్ఆర్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు పార్టీ ఎస్ఈసీ స‌భ్యుడు, కుడా మాజీ చైర్మ‌న్ కోట్ల హ‌ర్ష‌వ‌ర్ధ‌న్‌రెడ్డి, వైఎస్ఆర్‌సీపీ నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జ్ డాక్ట‌ర్ ఆదిమూల‌పు స‌తీష్ ఆధ్వ‌ర్యంలో కోడుమూరు ప‌ట్ట‌ణంలో త‌ల‌పెట్టిన నిర‌స‌న ర్యాలీకి అన్ని మండ‌లాల నుంచి అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా కదలివ‌చ్చారు.

ప్ర‌ధాన వీధుల వెంట వైఎస్ఆర్‌సీపీ శ్రేణులు ర్యాలీ నిర్వ‌హించి అధికారుల‌కు విన‌తిప‌త్రం అంద‌జేశారు. ఈ సంద‌ర్భంగా కోట్ల హ‌ర్ష‌వర్ధ‌న్‌రెడ్డి, డాక్ట‌ర్ ఆదిమూల‌పు స‌తీష్ మాట్లాడుతూ.. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో 11 ప్రభుత్వ వైద్య కళాశాలలు ఉండగా 2019లో వైఎస్‌ జగన్‌ అధికారం చేపట్టాక ఒకేసారి ఏకంగా 17 కొత్త వైద్య కళాశాలల ఏర్పాటుకు శ్రీకారం చుట్టార‌ని తెలిపారు. వీటిలో 5 మెడికల్‌ కళాశాలలను 2023–24లో గత ప్రభుత్వంలోనే ప్రారంభించార‌ని చెప్పారు. తద్వారా 750 ఎంబీబీఎస్‌ సీట్లను మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ మన విద్యార్థులకు అదనంగా సమకూర్చార‌ని గుర్తు చేశారు. ప్రజలకు చేరువలో మెరుగైన వైద్య సేవలు అందించేలా ప్రభుత్వాస్పత్రులను బోధనాస్పత్రులుగా బలోపేతం చేశార‌ని చెప్పారు.

కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక వైద్య కళాశాలలకు గ్రహణం పట్టుకుంద‌ని ధ్వ‌జ‌మెత్తారు. చంద్రబాబు కక్షపూరిత విధానాలతో రెండేళ్లలో రాష్ట్రం ఏకంగా 2,450 ఎంబీబీఎస్‌ సీట్లను కోల్పోయింద‌న్నారు. రూ. లక్ష కోట్ల విలువైన సంపద లాంటి ప్రజల ఆస్తులను పచ్చ కార్పొరేట్‌ గద్దలకు దోచిపెట్టడం కోసం చంద్రబాబు పీపీపీ కుట్రలు పన్నార‌ని ఆరోపించారు. ఏకంగా 10 కొత్త వైద్య కళాశాలలను ప్రైవేట్‌ వ్యక్తులకు కట్టబెట్టాలని నిర్ణయించ‌డం దుర్మార్గ‌మ‌న్నారు. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ వైఎస్సార్‌సీపీ చేప‌ట్టిన ప్ర‌జా ఉద్య‌మానికి అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల నుంచి విశేష స్పంద‌న వ‌స్తుంద‌ని, ఇందుకు కోటి సంత‌కాల సేక‌ర‌ణ‌, ర‌చ్చ‌బండ కార్య‌క్ర‌మాలే నిద‌ర్శ‌న‌మ‌న్నారు.

అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల మ‌ద్ద‌తు కూడ‌గ‌ట్టి మెడిక‌ల్ కాలేజీల ప్రైవేటీక‌ర‌ణ‌ను అడ్డుకుంటామ‌ని వారు హెచ్చ‌రించారు. కోడుమూరు నియోజకవర్గం భారీ ఎత్తున సుమారు మూడు వేల పైన జనాలను సమీకరించి భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కోడుమూరు, కర్నూలు నియోజకవర్గ అబ్జవర్ కర్ర హర్షవర్ధన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మణి గాంధీ, 40 వ కార్పొరేటర్ స్టాండింగ్ కమిటీ సభ్యులు విక్రమ్ సింహారెడ్డి, గూడూరు మున్సిపల్ చైర్మన్ జె వెంకటేశ్వర్లు, వైస్ చైర్మన్లు అస్లాం, లక్ష్మన్న, జెడ్పిటిసిలు రఘునాథ్ రెడ్డి, మౌలాలి, ప్రసన్నకుమార్, ఎంపీపీలు సునీతమ్మ, రూతమ్మ, మండల కన్వీనర్లు రమేష్ నాయుడు సోమశేఖర్ రెడ్డి మోహన్ బాబు రామాంజనేయులు గూడూరు టౌన్ కన్వీనర్ అబెల్, సర్పంచులు, ఎంపీటీసీ, జిల్లా కమిటీ నాయకులు , కోడుమూరు నియోజకవర్గ అనుబంధంలో విభాగాల నాయకులు, అన్ని మండలాల అనుబంధ విభాగాల అధ్యక్షులు, గ్రామ కమిటీలు నాయకులు, కోడుమూరు నియోజకవర్గం, అన్ని గ్రామాల నాయకులు, కార్యకర్తలు, రైతులు విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.