శక్తి యాప్ సేవలు సద్వినియోగం చేసుకోండి…

కిరణ్ 24×7 న్యూస్:
శక్తి ఆఫ్ సేవలను సద్వినియోగం చేసుకొని మహిళలు విద్యార్థులు అపత్కాలంలో రక్షణ పొందవచ్చు అని కర్నూలు సబ్ డివిజన్ శక్తి టీం సభ్యులు అన్నారు . కర్నూల్ జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు మరియు సీఐ విజయలక్ష్మి ఆధ్వర్యంలోజిల్లా వ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో కళాశాలలో విద్యార్థులకు శక్తి ఆప్ పై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమంలో భాగంగ జూలకల్ గ్రామంలో ని ఏపీ మోడల్ స్కూల్ నందు శక్తి యాప్ పై అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శక్తి యాప్ అపత్కాలంలో మహిళలకు విద్యార్థులకు రక్షణగా నిలుస్తుందని తెలిపారు అత్యవసర సమయాల్లో వాట్సాప్ నంబర్: 7993485111 కు కాల్ చేసిన మెసేజ్ చేసిన పోలీసులు వెంటనే స్పందించి అవసరమైన చర్యలు చేపడుతారని అన్నారు. శక్తి యాప్ ను ప్రతి ఒక్క మహిళ విద్యార్థినులు మొబైల్ లో డౌన్లోడ్ చేసుకోవాలని అన్నారు .అత్యవసర సమయాల్లో పోలీస్ స్టేషన్ కు వెళ్లాల్సిన అవసరం లేకుండా డయల్ 112,181,chaild marriage 1098, Cyber crime’ 1930,


🆘 బటన్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు అన్నారు. అంతే కాకుండా ఉమెన్ అండ్ చైల్డ్ సేఫ్టీ గురించి సోషల్ మీడియా ప్రభావం చదువుకు ఉన్న ప్రాముఖ్యత ఈవ్ టీజింగ్ మొదలైన వాటి గురించి క్షుణ్ణంగా అవగాహన కల్పించడం అయినది.
కార్యక్రమంలో కర్నూలు సబ్ డివిజన్ శక్తి టీం సభ్యులు హెచ్ సి ఎస్ ఎం భాష, పిసి.చిన్న రాజు మరియు గూడూరు పిఎస్ హెచ్ సి గోపాల్, స్కూల్ హెడ్మాస్టర్ డిల్షాద్ మరియు స్కూల్ టీచర్స్ పాల్గొన్నారు.