పత్తి కొనుగోలు ప్రక్రియలో రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలి…
*జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి:*
కిరణ్ 24×7 న్యూస్:
పత్తి కొనుగోలు ప్రక్రియలో రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి సీసీఐ అధికారులను ఆదేశించారు.
సోమవారం గూడూరు మండలం పెంచికలపాడు గ్రామంలో ఉన్న మంజిత్ కాటన్ జిన్నింగ్ & ప్రెసింగ్ యూనిట్లో సీసీఐ ద్వారా జరుగుతున్న పత్తి కొనుగోలు ప్రక్రియకు సంబంధించి అధికారులతో, రైతులతో మాట్లాడారు.
ఈ సందర్భంగా పత్తి రైతులు తమ సమస్యలను కలెక్టర్ దృష్టికి తెచ్చారు. జిల్లా కలెక్టర్ స్పందించి రైతులు పత్తిని బాగా ఆరబెట్టుకుని తీసుకురావాలని, పత్తి లో చెత్త లేకుండా చూసుకోవాలని సూచించారు. స్లాట్ బుకింగ్ లో సచివాలయ సిబ్బంది తగిన సహకారం అందించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. పత్తి తీసుకొచ్చిన రైతులను వెనక్కు పంపవద్దని, రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
కలెక్టర్ వెంట మార్కెటింగ్ ఏడి నారాయణమూర్తి, గూడూరు తహసీల్దార్ వెంకటేష్ నాయక్ సీసీఐ అధికారులు, రైతులు ఉన్నారు.






