సి బెళగల్ పోలీస్ స్టేషన్ సిబ్బందికి ప్రశంసా పత్రాలు..
కిరణ్ 24×7 న్యూస్:
కర్నూలు పట్టణంలో జరిగిన క్రైమ్ మీటింగ్ నందు కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ సి బెళగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల రికవరీ చేయబడిన దొంగతనం కేసు గురించి ప్రత్యేక అభినందనలు తెలియజేయడంజరిగింది.
ఈ కేసు నందు ప్రతిభ కనబరిచిన కేసులు ఛేదించిన సి.బెళగల్ పోలీస్ స్టేషన్ ఎస్సై వేణుగోపాల్ రాజు మరియు పోలీసు సిబ్బంది భాస్కర్ సుధాకర్ మల్లికార్జున లకు ప్రశంసా పత్రాలు అందజేయడం జరిగింది పోలీసులు చేదించిన కేసు నందు 85 గ్రాముల బంగారు 540 గ్రాముల వెండి ఒక లక్ష రూపాయల నగదు రికవరీ చేయబడినది






