జిల్లా పోలీసు అధికారులతో నేర సమీక్షా సమావేశం .
• రోడ్డు ప్రమాదాలు , సైబర్ నేరాలు తగ్గించడమే లక్ష్యంగా పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు చేపట్టాలి.
కిరణ్ 24 x7 న్యూస్:
ప్రాపర్టీ కేసులు చేధించి , రికవరీల శాతాలను బాగా పెంచాలని జిల్లాలోని పోలీసు అధికారులకు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ తెలిపారు.
ఈ సంధర్బంగా శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో జిల్లాలోని డిఎస్పీలు, సిఐలు, ఎస్సైల తో నేర సమీక్షా సమావేశం నిర్వహించి పోలీసు అధికారులతో మాట్లాడారు.
రోడ్డు ప్రమాదాలు, సైబర్ నేరాలు తగ్గించడమే లక్ష్యంగా కర్నూలు, పత్తికొండ, ఆదోని, ఎమ్మిగనూరు సబ్ డివిజన్ లలోని అన్ని పోలీసు స్టేషన్ల పరిధులలో రోడ్డు ప్రమాదాల నివారణ కు పెద్ద ఎత్తున ప్రజలకు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు.
రోడ్డు ప్రమాదాలు రాత్రి వేళలో ఎక్కువ జరుగుతున్నాయన్నారు.
గుంతలు, మలుపులు ఉన్నచోట రోడ్డు ప్రమాదాలు జరగవచ్చు అనే ప్రాంతాలను గుర్తించాలన్నారు.
రోడ్డు ప్రమాదాలు జరగకుండా రోడ్లకు తగిన మరమ్మతులు చేయించాలన్నారు.
ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించే ఓవర్ లోడింగ్ వాహనాలను వెంటనే నిలిపి వేయాలన్నారు.
మద్యం తాగి వాహనం నడుపరాదని, సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయరాదని, ట్రిపుల్ రైడింగ్, రాంగ్ రూట్ డ్రైవింగ్, అతివేగం , హెల్మెట్ లేకుండా ప్రయాణించరాదని ప్రజలకు కౌన్సిలింగ్ చేయాలన్నారు.
మర్డర్ ల కంటే రోడ్డు ప్రమాదాలలోనే మరణాలు ఎక్కువగా జరుగుతున్నాయన్నారు.
రోడ్డు ప్రమాదాలు తగ్గించగలిగితే ఎంతో మంది కుటుంబాలు బాగు పడతాయన్నారు.
డ్రంక్ అండ్ డ్రైవ్, ఓపెన్ డ్రింకింగ్ ల పై స్పెషల్ డ్రైవ్ చేపట్టి గట్టి చర్యలు తీసుకోవాలన్నారు.
సిసిఎస్ పోలీసులు కర్నూలు నాల్గవ పట్టణ పోలీసుస్టేషన్ , కర్నూలు మూడవ పట్టణ పోలీసు స్టేషన్ లలో పెండింగ్ లో ఉన్న ప్రాపర్టీ కేసులను చేధించాలన్నారు.
క్రైమ్ పార్టీ పోలీసులు కూడా బాగా పని చేయాలన్నారు.
ఆదివారం పోలీసుస్టేషన్ లలో రౌడీ షీటర్లను బాగా కౌన్సిలింగ్ చేయాలన్నారు.
వయస్సు పై బడిన కొందరు రౌడీ షీటర్లు, రౌడీషీట్ లను తొలగించాలని జిల్లా ఎస్పీ కి విన్నవించడం జరిగిందన్నారు.
రేపు భారత్ బంద్ ప్రకటించిన సంధర్బంగా పోలీసులు విధుల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు.
ఫేక్ ఎన్ కౌంటర్ పై కర్నూలు కలెక్టరేట్ దగ్గర ర్యాలీలో పాల్గొన్న వారి యొక్క పూర్తి వివరాలను సేకరించాలని అడిషనల్ ఎస్పీ గారికి సూచించారు.
సచివాలయం మహిళా పోలీసులను బందోబస్తు మినహా, స్టేషన్ రికార్డు విధులకు, రిసెప్సన్, అవగాహన కార్యక్రమాలకు వినియోగించాలన్నారు.
కోర్టులో ఉన్న పెండింగ్ కేసులను త్వరగా ట్రయల్ కు వచ్చే విధంగా కృషి చేయాలన్నారు.
నేర నివారణే లక్ష్యంగా విజిబుల్ పోలీసింగ్ బాగా చేయాలన్నారు.
గత నెలలో వివిధ కేసులలో ప్రతిభ కనబరచిన పోలీసు అధికారులు, పోలీసు సిబ్బందికి జిల్లా ఎస్పీ ప్రశంసా పత్రాలను అందజేశారు.
ఈ నేర సమీక్ష వేశంలో అడిషనల్ ఎస్పీలు హుస్సేన్ పీరా, కృష్ణమోహన్, లీగల్ అడ్వైజర్ మల్లికార్జున రావు, డిఎస్పీలు బాబు ప్రసాద్ , వెంకట్రామయ్య , హేమలత, భార్గవి , సిఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.






