సామాజిక పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న రైతు సహకార సంఘం చైర్మన్.
కిరణ్ 24×7 న్యూస్:
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు* *నాయుడు* ఆదేశాల మేరకు, *నారా లోకేష్* నేతృత్వంలో, గూడూరు మండల సహకార సంఘం చైర్మన్* ఆధ్వర్యంలో గూడూరు నగర పంచాయతీ ఎస్సీ కాలనీలో* సామాజిక పెన్షన్ పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గూడూరు మండల రైతు సహకార సంఘం చైర్మన్ బి. దానమయ్య పాల్గొన్నారు.
ఈ సందర్భంగా * ఆయన* మాట్లాడుతూ, “సామాజిక పెన్షన్ పేద కుటుంబాలకు అండగా నిలుస్తున్న అద్భుతమైన సంక్షేమ కార్యక్రమం. *ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర పెద్ద కొడుకు లా పేదల* *బాగోగులు* చూసుకుంటూ పెన్షన్‌ను ఇంటి వద్దకే చేర్చి సౌకర్యాన్ని అందిస్తున్నారు” అని తెలిపారు.“వికలాంగులకు ప్రభుత్వ పెన్షన్ ఆత్మవిశ్వాసం కలిగించే జీవన శక్తి. వితంతువులకు ఈ పెన్షన్ నూతన జీవనానికి ధైర్యం ఇచ్చే వెలుగు” అని చెప్పారు.
ఈ కార్యక్రమంలో సచివాలయం సిబ్బంది విష్ణువర్ధన్ రెడ్డి వర్గం నేతలు టీడీపీ కార్యకర్తలు తదితర నాయకులు పాల్గొన్నారు.






