వికలాంగులకు ప్రభుత్వ పెన్షన్ జీవనశక్తి…. నాయకులు చరణ్ కుమార్.
కిరణ్ 24×7 న్యూస్:
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు* *నాయుడు* ఆదేశాల మేరకు, *నారా లోకేష్* నేతృత్వంలో, కర్నూల్ పార్లమెంట్ తెలుగు యువత కార్యదర్శి *చరణ్ కుమార్* ఆధ్వర్యంలో గూడూరు నగర పంచాయతీ *4వ వార్డ్* నందు సామాజిక పెన్షన్ పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కర్నూల్ పార్లమెంట్ తెలుగు యువత కార్యదర్శి *చరణ్* *కుమార్* , సచివాలయం అడ్మిన్ స్వాతి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా *చరణ్ కుమార్* మాట్లాడుతూ, “సామాజిక పెన్షన్ పేద కుటుంబాలకు అండగా నిలుస్తున్న అద్భుతమైన సంక్షేమ కార్యక్రమం. *ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర పెద్ద కొడుకు లా పేదల* *బాగోగులు* చూసుకుంటూ పెన్షన్ను ఇంటి వద్దకే చేర్చి సౌకర్యాన్ని అందిస్తున్నారు” అని తెలిపారు.“వికలాంగులకు ప్రభుత్వ పెన్షన్ ఆత్మవిశ్వాసం కలిగించే జీవన శక్తి. వితంతువులకు ఈ పెన్షన్ నూతన జీవనానికి ధైర్యం ఇచ్చే వెలుగు” అని చెప్పారు.

ఈ కార్యక్రమంలో టీడీపీ కార్యకర్తలు తదితర నాయకులు పాల్గొన్నారు.






