ప్రమాదాల నివారణకు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలి…
కిరణ్ 24×7 న్యూస్:
అతి వేగం అనర్థాలకు మూలం అవుతుందని గూడూరు పోలీస్ స్టేషన్ ఎస్సై హనుమంత రెడ్డి తెలిపారు. బుధవారం గూడూరు పట్టణంలో ఎస్సై హనుమంత రెడ్డి జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ మరియు కోడుమూరు సిఐ ఆదేశాల మేరకు ప్రమాదాల నివారణకై హెల్మెట్ వాడకం గురించి అతివేగం ప్రమాదకరం అంటూ ప్రజలకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఎస్సై మాట్లాడుతూ ఇటీవల కాలంలో వాహనదారులు వాహనాలు నడిపే సమయంలో తగు జాగ్రత్తలు పాటించకుండా వాహనాలు నడపడంతో రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయని వాహనాలు నడిపే వాహన దారులు తప్పనిసరిగా హెల్మెట్ వాడకం అలవాటు చేసుకోవాలని తెలిపారు. హెల్మెట్ తప్పనిసరిగా ధరించి ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ సురక్షితంగా ప్రయాణాలు చేయాలని ఎస్ఐ ప్రజలకు స్పష్టంగా వివరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక పోలీస్ స్టేషన్ సిబ్బంది పోలీసులు పాల్గొన్నారు.







