మద్యం తాగి వాహనం నడిపిన ట్రావెల్స్ బస్సు డ్రైవర్లకు ఇద్దరికీ 15 రోజుల పాటు జైలు శిక్ష.

కిరణ్ 24×7 న్యూస్:
రోడ్డు ప్రమాదాల నివారణకు జిల్లా ఎస్పీ  విక్రాంత్ పాటిల్ ఐపిఎస్  ఆదేశాల మేరకు కర్నూల్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు.


120 మంది ప్రయాణికులతో బళ్లారి నుండి హైదరాబాద్ వెళ్తున్న
ఐవిఆర్ ట్రావెల్స్ మరియు గీతా ట్రావెల్స్ ప్రైవేట్ బస్సులను సోమవారం రాత్రి ఆదోని పిసిఆర్ సర్కిల్ దగ్గర ఆదోని రెండో పట్టణ సీఐ రాజశేఖర్ రెడ్డి, పోలీసు సిబ్బందితో కలిసి డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు.

ఇద్దరు బస్సు డ్రైవర్లు , ఒక ద్విచక్ర వాహనదారుడు డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డారు.

ట్రావెల్స్ బస్ డ్రైవర్లకు ఆదోని జె ఎఫ్ సి ఎం కోర్టు వారు 15 రోజుల పాటు జైలు శిక్ష విధించారు.

ఒక ద్విచక్ర వాహనదారుడు కి ఆదోని జె ఎఫ్ సి ఎం కోర్టు వారు 3 రోజుల పాటు జైలు శిక్ష విధించారు