రైతన్న మీకోసం కార్యక్రమంలో పాల్గొన్న కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి

కిరణ్ 24×7 న్యూస్:
*తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు కే డి సి సి చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి సూచనల మేరకు బుధవారం కర్నూలు మండలం గొందిపర్ల గ్రామంలో రైతన్న మీకోసం కార్యక్రమంలో పాల్గొన్న కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి*


రైతులకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి అవగాహన కల్పించే ఉద్దేశ్యంతో నిర్వహించిన ప్రత్యేక ప్రచార కార్యక్రమంలో కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంఎల్ఏ మాట్లాడుతూ రైతులకు అండగా కూటమి ప్రభుత్వం నిలుస్తూ ,రైతు సంక్షేమం కోసం ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు మరో ముందడుగు వేస్తూ రైతన్న మీకోసం పేరుతో సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు. రైతన్న కోసం – మీ కోసం పేరుతో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో పంటలాభాలు పెంచే విధానాలు, ఆధునిక సేదపద్ధతులు, సబ్సిడీల వివరాలు, భవిష్యత్ వ్యవసాయ విధానాలు వంటి అనేక అంశాలను ప్రజలకు వివరించారు.

రైతుల సమస్యలు, పంటల నష్టం, మార్కెట్ స్థితి, ప్రభుత్వం అందిస్తున్న సహాయాలు వంటి విషయాలపై ఈ సమావేశంలో చర్చించబడింది. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి వివరించారు.
ఈ కార్యక్రమంలో కర్నూలు మండల అగ్రికల్చరల్ అధికారులు, సచివాలయ సిబ్బంది,స్థానిక రైతులు,కూటమి నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.