నంద్యాల జిల్లా డిసిసి అధ్యక్షులు శ్రీ జే.లక్ష్మీ నరసింహ యాదవ్ గారి ఆహ్వానం మేరకు మన గౌరవ శాసనసభ్యులు శ్రీ తోగురు ఆర్థర్ గారు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలతో పరిచయ కార్యక్రమం అనంతరం మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది.*

*ఎమ్మెల్యే ఆర్థర్ గారు* మాట్లాడుతూ దివంగత నేత మాజీ ముఖ్యమంత్రివర్యులు *స్వర్గీయ వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి కుమార్తె పిసిసి అధ్యక్షురాలు షర్మిలమ్మ గారి నాయకత్వంలో నందికొట్కూర్ నియోజకవర్గం లో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు పని చేస్తామని అధిష్టానం ఆదేశానుసారం నడుచుకుంటూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానన్నారు.

ఈ కార్యక్రమంలో నంద్యాల పట్టణ అధ్యక్షులు దాసరి చింతాలయ్య , జిల్లా ఉపాధ్యక్షులు బోయ రమణ, అబ్దుల్ మజీద్ , బి హుస్సేన్ బాషా , అబ్దుల్ రెహ్మాన్ , నంద్యాల నియోజకవర్గం యస్ ఎం డి ఫరూఖ్ , జిల్లా యస్సీ సెల్ అద్యక్షులు మిద్దెల నాగళింగం , జిల్లా సీనియర్ నాయకులు హరిజన బాలస్వామి , శ్రీశైలం నియోజకవర్గం కో ఆర్డినేషన్ సభ్యులు సయ్యద్ అశార్ ఇస్మాయిల్ , జిల్లా ప్రధాన కార్యదర్శి రియాజ్ బాషా , రాష్ట్ర మైనారిటీ సెల్ కార్యదర్శి శంసుల్ హాక్ , పట్టణ నాయకులు అహ్మద్ హుస్సేన్ , ముళ్ళ కరిముల్లా, సంజీవ కుమార్ , వెంకట నరసింహులు , పాములపాడు మండల నాయకులు ముడియాల వెంకట రమణారెడ్డి, దామ గట్ల సుంకన్న మరియు నందికొట్కూరు నియోజకవర్గ ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.