గూడూరులో ఘనంగా పేరెంట్స్ డే కార్యక్రమం

కిరణ్ 24×7 న్యూస్:

గూడూరు జిల్లా పరిషత్ బాలుర, మరియు బాలికల ఉన్నత పాఠశాలలో శుక్రవారం ఉపాధ్యాయుల తల్లిదండ్రుల సమావేశం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతులుగా గూడూరు పోలీస్ స్టేషన్ ఎస్ఐ హనుమంత రెడ్డి, కేడీసీసీ గూడూరు చైర్మన్ దానమయ్య, పాఠశాల కమిటీ చైర్మన్ కర్ణ, బాలికల పాఠశాల చైర్మన్ మల్లాపూ రాజశేఖర్.పట్టణ టిడిపి అధ్యక్షులు కురుకుంద రామాంజనేయులు, నాయకులు, రేమట వెంకటేశ్వర్లు, సృజన్ కౌన్సిలర్లు శాశావళి బుడ్డెంగలి, మరియు నాయకులు హాజరయ్యారు.

ఈ కార్యక్రమంలో ముందుగా సమావేశానికి విచ్చేసిన ఎస్ఎంసి చైర్మన్లు  కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, విద్యార్థుల తల్లిదండ్రులందరికీ ప్రభుత్వం పాఠశాలకు మంజూరు చేసిన జీవశాస్త్ర ప్రయోగశాలలోని మరియు భౌతిక, రసాయనిక శాస్త్ర ప్రయోగశాలలోని పరికరాలను మరియు ఒకేషనల్ ల్యాబ్ లోని పరికరాలను, స్పోర్ట్స్ కిట్స్ ను, వృత్తి విద్యా ప్రయోగశాలలోని పరికరాలను చూపించడం జరిగింది.అలాగే గత 5నెలల కాలంలో పాఠశాలలో జరిగిన వివిధ జాతీయ కార్యక్రమాల ఫోటోల ప్రదర్శన ఎస్ఎంసి కమిటీ సభ్యులను, గ్రామ పెద్దలను, తల్లిదండ్రులను బాగా ఆకట్టుకుంది.

అనంతరం ముఖ్య అతిథులు బాలుర బాలికల పాఠశాల ప్రధానోపాధ్యాయులు అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య అతిథులు మరియు ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ పదవ తరగతి విద్యార్థులకు ప్రభుత్వం నిర్ణయించిన 100 రోజుల ప్రత్యేక కార్యక్రమాల గురించి వివరిస్తూ పాఠశాలల్లో విద్యార్థులను బాగా చదివిస్తున్నామని,తల్లిదండ్రులు కూడా విద్యార్థులను ఇంటి దగ్గర బాగా చదివించాలని కోరారు. వెనుకబడిన విద్యార్థుల కోసం పాఠశాలలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని తెలిపారు.

కమిటీ చైర్మన్ లు మాట్లాడుతూ విద్యార్థులు బాగా చదివేలా తల్లిదండ్రులు సహకరించాలని, విద్యార్థులు కూడా బాగా చదివి ప్రతి ఒక్కరు పదవ తరగతిలో ఉత్తీర్ణులు కావడానికి ప్రయత్నించాలని కోరారు. అనంతరం జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలలో విద్యార్థులు చేసిన నృత్యాలు మరియూ నాటికలు అందరిని బాగా ఆకట్టుకున్నాయి.  విద్యార్థులు చేసిన నృత్యం అందరినీ విశేషంగా అలరించింది. ఈ కార్యక్రమంలో గూడూరు పోలీస్ స్టేషన్ ఎస్ఐ హనుమంత రెడ్డి, కేడీసీసీ గూడూరు చైర్మన్ దానమయ్య, పాఠశాల కమిటీ చైర్మన్ లు కర్ణ మరియు మల్లాపు రాజశేఖర్, పట్టణ టిడిపి అధ్యక్షులు కురుకుంద రామాంజనేయులు, నాయకులు, రేమట వెంకటేశ్వర్లు,సృజన్, కౌన్సిలర్లు శాశావళి బుడ్డెంగలి, మరియు నాయకులు చాంద్ వలి,  చిరంజీవి ఉపాధ్యాయులు రవికుమార్,రమేష్ రాజశేఖరప్ప, సుబ్బరాయుడు,వెంకట రాముడు, జయలక్ష్మి, జ్యోతి మరియు విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.