గూడూరులో ఘనంగా ఏఐటీయూసీ మండల మహాసభ
కిరణ్ 24x 7 న్యూస్:
గూడూరు పట్టణంలో ,ఏఐటీయూసీ కార్మిక సంఘాల మహాసభ ఘనంగా నిర్వహించారు. ఏఐటియుసి, గూడూరు నాయకులు బీడీల శ్రీనివాసులు, ఓబులేసుల ఆధ్వర్యంలో స్థానిక కొత్త బస్టాండ్ నుండి, డప్పు కళాకారుల ప్రదర్శన నిర్వహిస్తూ, ఏఐటీయూసీ జిందాబాద్ ,కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి, ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాడుతామని, ఏఐటియుసి మండల
మహాసభను జయప్రదం చేయాలని, నినాదాలు చేస్తూ, భారీ ఎత్తున ఆటో కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు, అమాలి కార్మికులు ,ఊరేగింపుగా బయలుదేరి, స్థానిక పాత బస్టాండ్ కు చేరుకొని, ఆటో స్టాండ్ దగ్గర ఏర్పాటుచేసిన జెండాను, ఆటో వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి ఈశ్వర్ ఆవిష్కరించగా, బస్ షెల్టర్ నందు ఏర్పాటుచేసిన ఏఐటియుసి జెండాను, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి ఎస్ మునియప్ప ఆవిష్కరించారు. అనంతరం అక్కడ నిర్వహించిన బహిరంగ సభకు, ఏఐటీయూసీ జిల్లా సమితి
సభ్యులు, బీడీల శ్రీనివాసులు అధ్యక్షత వహించగా, ముఖ్య ఆహ్వానితులుగా విచ్చేసిన, ఏఐటియుసి జిల్లా కార్యదర్శి, ఎస్ మునియప్ప ,సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి ఎన్ లెనిన్ బాబు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ,బి కృష్ణ,, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు, జిల్లా సమితి సభ్యులు ,బి రాజు ,డి శేష్ కుమార్లు వేదికను అలంకరించారు.
ఈ సందర్భంగా, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి ఎస్ మునియప్ప, సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి ఎన్ లెనిన్ బాబులు మాట్లాడుతూ,, కేంద్ర ప్రభుత్వం ఎన్నో ఏళ్లుగా, సాధించి తెచ్చుకున్న, కార్మిక చట్టాలను, నాలుగు కోడ్లుగా, విభజించి కార్మిక ద్రోహానికి పాల్పడుతుందని వారు విమర్శించారు. ప్రభుత్వానికి కార్మికులపై జాలి లేదని వారన్నారు. జాతీయ ఉపాధి గ్రామీణ పథకం ఉపాధి కూలీలకు సాధించి తీసుకొస్తే, ఆ పథకానికి అనేక ఆంక్షలు విధించి, కూలీలకు అందకుండా, పథకాలను నిర్వీరం చేస్తుంది ప్రభుత్వమని వారు తెలిపారు .ప్రభుత్వానికి కార్మికులపై చిత్తశుద్ధి లేదని ,ఎప్పటికప్పుడు కార్మిక ద్రోహానికి పాల్పడే విధంగా, పరిపాలన కొనసాగిస్తున్న తప్ప, కార్మికులకు న్యాయం చేసే విధంగా పాలించడం లేదని వారు దుయ్యబట్టారు. ఇక రాష్ట్ర ప్రభుత్వానికి వస్తే, పడమటి ప్రాంతమైన కర్నూలు జిల్లాను, ఎటువంటి అభివృద్ధికి నోచుకోనీయకుండగా, నిధులు కేటాయించకుండా, పాలన కొనసాగిస్తుంది, నెత్తి మీద తుంగభద్ర నది ప్రవహిస్తున్న, జిల్లాకు త్రాగడానికి, గుక్కెడు నీరు కూడా లేని దుస్థితి, ఈ జిల్లాలో ఏర్పడింది, గూడూరుకు అతి దగ్గరలో తుంగభద్ర నది ఉన్న, త్రాగడానికి నీరు లేదు, గుండ్రేవుల ప్రాజెక్టు పూర్తి చేస్తే ,కర్నూలు జిల్లాకే కాదు ,కడప ,అనంతపురం వరకు కూడా పొలాలన్నీ సస్యశ్యామలమవుతాయి, గ్రామాలకు త్రాగునీరు అందుతుందని, ఎన్నోసార్లు ముఖ్యమంత్రులు, దృష్టికి తీసుకువెళ్లిన ,ఆ ప్రాజెక్టు నిర్మాణానికి ప్రభుత్వం చొరవ చూపడం లేదని వారు విమర్శించారు. భవిష్యత్తులో ఏఐటీయూసీ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో, జరగబోయే, పోరాటాలలో కార్మికులందరూ, ఐక్యంగా ముందుకు వచ్చి భాగస్వాములు కావాలని వారు తెలిపారు. ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు బి కృష్ణ ,మాట్లాడుతూ,, కర్నూలు జిల్లాలో ,అన్ని మండలంలో, గ్రామాలు కూలీలకు ఉపాధి లేక, రైతులకు పంటలు చేతికి రాక ,ఇతర గ్రామాలకు వలసలు వెళుతున్న, ప్రభుత్వం కానీ, అధికారులు కానీ ,వారిని ఆదుకోవడంలో విఫలమయ్యారని, ఆయన ఆవేదన చెందారు. ఎక్కడ కూడా కూలీలకు పనులు కల్పించకుండా ,నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారని, తక్షణమే కూలీలకు పనులు కల్పించి, వలసలను నివారించకపోతే ,పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగిస్తామని, ఆయన తెలిపారు. ఈ బహిరంగ సభలో ,ఏఐటీయూసీ నియోజకవర్గ కార్యదర్శి మద్దూరు చిన్న రాముడు,ఆటో వర్కర్స్ యూనియన్ జిల్లా నాయకులు ఆటో మధు,గూడూరు ఎఐటియుసి నాయకులు, ఓబులేసు ,ఆటో వర్కర్స్ యూనియన్ నాయకులు విగ్నేష్ ,హమాలి కార్మికులు శివ, దాసు, మల్లికార్జున ,మురళి, భవన నిర్మాణ కార్మికులు లక్ష్మన్న, గిరి, ఆటో బాలు తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రదర్శనలో కర్నూలు జిల్లా ప్రజానాట్యమండలి కార్యదర్శి ,యు నాగరాజు బృందం, డప్పు నృత్యం, పాటలు, ప్రజలందరినీ ఆకర్షించాయి. వారికి గూడూరు మండల ఏఐటీయూసీ నాయకత్వం తరఫున, ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు..







