ఇది ప్రారంభం మాత్ర‌మే..కోడుమూరు నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జ్ డాక్ట‌ర్ ఆదిమూల‌పు స‌తీష్‌..

కిరణ్ 24×7 న్యూస్:

మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ప్రజా ఉద్యమం లో కదంతొక్కిన కర్నూలు జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గ ఇంచార్జి ఎస్వి మోహన్ రెడ్డి, కుడా మాజీ చైర్మన్ కోడుమూరు నియోజకవర్గ సమన్వయకర్త రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యులు కోట్ల హర్షవర్ధన్ రెడ్డి, వైఎస్ఆర్‌సీపీ కోడుమూరు నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జ్ డాక్ట‌ర్ ఆదిమూల‌పు స‌తీష్‌..

మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ప్రజా ఉద్యమం కర్నూలు జిల్లా అధ్యక్షులు ఎస్సీ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఏడు నియోజకవర్గాలకు సంబంధించి ప్రజల నుండి నాలుగు లక్షలకు పైగా సేకరించిన సంతకాల పత్రులని కర్నూలు జిల్లా కేంద్రం నుండి ర్యాలీగా వాహనంలో జెండా ఊపి తాడేపల్లి ప్రధాన కార్యాలయానికి సాగనంపిన వైఎస్ఆర్సిపి కర్నూలు జిల్లా అధ్యక్షులు ఎస్పీ మోహన్ రెడ్డి, మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి, ఆదోని నియోజకవర్గం ఇంచార్జి మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి, పత్తికొండ నియోజకవర్గం ఇంచార్జి మాజీ ఎమ్మెల్యే శ్రీదేవి, కర్నూలు పార్లమెంట్ ఇంచార్జి బుట్టా రేణుక, కుడా మాజీ చైర్మన్, కోడుమూరు నియోజకవర్గ సమన్వయకర్త, రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యులు కోట్ల హర్షవర్ధన్ రెడ్డి, కోడుమూరు నియోజకవర్గ వైఎస్ఆర్సిపి ఇంచార్జి డాక్టర్ ఆదిమూలపు సతీష్, కర్నూలు మేయర్ బి వై రామయ్య, ఎమ్మిగనూరు నియోజకవర్గం ఇంచార్జ్, రాజీవ్ రెడ్డి, మరియు పార్టీ ముఖ్య నేతలు..

ప్రభుత్వం మెడికల్ కళాశాలు ప్రైవేటీకరణ చేయాలనే కూటమి ప్రభుత్వ ఆలోచనలను ఎట్టి పరిస్థితుల్లో జరగనివ్వమని కుడా మాజీ చైర్మన్ కోడుమూరు నియోజకవర్గ సమన్వయకర్త రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యులు కోట్ల హర్షవర్ధన్ రెడ్డి, వైఎస్సార్‌సీపీ కోడుమూరు నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జ్ డాక్ట‌ర్ ఆదిమూల‌పు స‌తీష్ హెచ్చ‌రించారు. ఇది ప్రారంభం మాత్రమే… ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై తీవ్రస్థాయిలో ఉద్యమిస్తామ‌న్నారు. వైఎస్ జ‌గ‌న్ పిలుపు మేర‌కు సోమ‌వారం క‌ర్నూలు న‌గ‌రంలో త‌ల‌పెట్టిన కోటి సంత‌కాల ప్ర‌తుల ర్యాలీలో కోడుమూరు నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన ప్ర‌జ‌లు, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

ఈ సంద‌ర్భంగా కోట్ల హర్షవర్ధన్ రెడ్డి, ఆదిమూల‌పు స‌తీష్ మాట్లాడుతూ.. వైయ‌స్‌ జగన్ ఆదేశాల మేరకు కోడుమూరు నియోజ‌క‌వ‌ర్గంలో కోటి సంతకాల సేకరణ కార్య‌క్ర‌మం విజ‌య‌వంతంగా పూర్తి చేశామ‌న్నారు. కూటమి ప్రభుత్వ విధానాలను ప్రజల తీవ్రంగా వ్యతిరేకిస్తున్నార‌ని ఈ సంత‌కాల సేక‌ర‌ణ ద్వారా వెల్ల‌డైంద‌న్నారు. పేదవాడికి వైద్యం అందాలంటే వైద్య కళాశాలలు ప్రభుత్వ అధీనంలోనే ఉండాల‌న్నారు. లక్షల కోట్లు అప్పులు చేస్తున్న చంద్రబాబు వైద్య కళాశాలలకు 5000 కోట్లు మంజూరు చేయలేకపోతున్నార‌ని విమ‌ర్శించారు. మెడికల్ కాలేజీ, జనరల్ ఆసుపత్రి ప్రభుత్వ నిర్వహణలో ఉంటే పేదలకు ఎంతో మేలు జరుగుతుందన్నారు.

మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్య‌మాన్ని ఆపే ప్ర‌స‌క్తే లేద‌న్నారు. ఈ కార్యక్రమంలో కోడుమూరు నియోజకవర్గం జడ్పిటిసి, ఎంపీపీ, సర్పంచులు, ఎంపీటీసీలు, రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, నియోజవర్గ స్థాయి నాయకులు, మండల నాయకులు, గ్రామ నాయకులు పెద్ద ఎత్తున కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.