జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం నిధులు కేటాయించాలి…. సిపిఐ..
కిరణ్ 24×7 న్యూస్:
హంద్రీనీవా కాలువ ద్వారా కర్నూలు జిల్లాలో పంటపొలాలు నీరు అందించి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని జిల్లాలో పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయాలి గుండ్రేవుల ప్రాజెక్టు ద్వారా కోడుమూరు నియోజకవర్గ ప్రజలకు త్రాగునీరు సాగునీరు అందించాలి..
సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి నక్కిలెనిన్ బాబు డిమాండ్ చేశారు
ఆదివారం నాడు స్థానిక సిపిఐ భవన్ నందు సిపిఐ నియోజవర్గ గూడూరు సి.బెళగల్ కోడుమూరు మండలాల జనరల్ బాడీ సమావేశం ఈ సమావేశం అధ్యక్షతన మండల కార్యదర్శి బి రాజు అధ్యక్ష వహించడం జరిగింది.

ఈ సందర్భంగా సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శ నక్కి లెనిన్ బాబు మాట్లాడుతూ భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ డిసెంబర్ 25వ తేదీన పార్టీ వార్షికోత్సవాలను జయప్రదం చేయాలని రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కావాలంటే రాష్ట్రంలో పెండింగ్ సాగునీటి ప్రాజెక్టులు, నూతన పరిశ్రమలు, వెనుక ఉన్న ప్రాంతాల రాయలసీమ ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ , రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వ శాఖలో ఉన్న ఖాళీగా ఉన్న ఉద్యోగాలు భర్తీ, రైతాంగ కార్మిక మహిళ సమస్యలపై చర్చించి భవిష్య ఉద్యమాలకు రూపకల్పన చేస్తామని అన్నారు.
కేంద్రంలోని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రజా వ్యతిరేక విధానాల అవలంబిస్తూ ప్రైవేటీకరణ ప్రోత్సహించడం, రాష్ట్రంలో డబల్ ఇంజన్ సర్కార్ కూడా ప్రజా సమస్యలను పరిష్కరించడంలో ఘోరంగా వైఫల్యం చెందుతుందని విమర్శించారు.
ముఖ్యమంత్రి రాజధాని నిర్మాణం,పోలవరం ప్రాజెక్టులపై ఉన్నటువంటి శ్రద్ధ వెనుక ఉన్న ప్రాంతాల అభివృద్ధికి ఎందుకు చొరవ చూపడం లేదని విమర్శించారు. కూటమి ప్రభుత్వం కర్నూలు జిల్లా అభివృద్ధి పట్ల నిర్లక్ష్యం చేయడం జిల్లా ప్రజలు మోసం చేయడమనే కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి పెండింగ్ ప్రాజెక్టులు పరిశ్రమల స్థాపన కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో చేనేత కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు మాధవ స్వామి సిపిఐ పట్టణ కార్యదర్శి శేష్ కుమార్ సహాయ కార్యదర్శి మద్దూరు చిన్న రాముడు సిపిఐ సీనియర్ నాయకులు భాస్కర్ ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు శ్రీరాములు ఏఐఎస్ఎఫ్ నాయకులు రంగస్వామి అల్తాఫ్ గూడూరు ఏఐటియుసి అధ్యక్షుడు రాజు సిపిఐనాయకులు శేషు దుబ్బన్న వ్యవసాయ కార్మిక సంఘం నాయకులుభాస్కర్ మహిళా సమైక్య జిల్లా సమితి సభ్యులు సులోచనమ్మఏఐటియుసి నాయకులు సుంకన్న విశ్వనాధ్ వల్కూరు కార్యదర్శికుళాయిల రాముడు తదితరులు పాల్గొన్నారు.







