గ్రంథాలయ స్థలాన్ని ఆక్రమించకుండా చర్యలు తీసుకుంటాం…

కిరణ్ 24×7 న్యూస్ :

కోడుమూరు గ్రంథాలయం పక్కన ఉన్న ప్రభుత్వ ఖాళీ స్థలాన్ని నూతనంగా విద్యార్థులకు పాఠకులకు అనుగుణంగా అదనపు గదులు నిర్మించడానికి సహకరించాలని కోరుతూ కోడుమూరు అభివృద్ధి కమిటీ సభ్యులు బుధవారం కోడుమూరు తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి మరియు కేడీసీసీ బ్యాంకు చైర్మన్ డి. విష్ణువర్ధన్ రెడ్డి ని, మరియు కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి ని కలిసి వినతి పత్రము సమర్పించడం జరిగినది.

టిడిపి ఇన్చార్జి విష్ణువర్ధన్ రెడ్డి కోడుమూరులో గ్రంధాలయ కొత్త భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయించి ప్రత్యేక చొరవ తీసుకొని నూతన భవనం నిర్మిస్తామని హామీ ఇచ్చారు.

ప్రభుత్వ స్థలాన్ని ఏ ప్రైవేట్ వ్యక్తులు ఆక్రమించిన ఉపేక్షించేది లేదని అన్నారు. ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి మాట్లాడుతూ సమస్యపై ప్రత్యేక శ్రద్ధ ఉంచి ప్రజల కోరిక మేరకు విద్యార్థుల భవిష్యత్తు దృష్టిలో ఉంచుకొని ప్రజా సంఘాలు వామపక్షాలు తెలుగుదేశం పార్టీ నాయకుల విజ్ఞప్తి మేరకు గ్రంథాలయం నిర్మించి తీరుతామని చెప్పడం జరిగినది.

నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి తక్షణమే స్పందించి పరిష్కరించే దిశలో హామీ ఇచ్చినందుకు కోడుమూరు అభివృద్ధి కమిటీ వారికి ధన్యవాదాలు తెలుపడం జరిగినది.