గూడూరు మండల సబ్ ఇన్స్పెక్టర్ రాజ కుల్లాయప్ప ని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ జెడ్పిటిసి ఎల్. వెంకటేశ్వర్లు..
కిరణ్ 24×7 న్యూస్ :
గూడూరు మండల సబ్ ఇన్స్పెక్టర్ రాజ కుల్లాయప్ప ని శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ జెడ్పిటిసి ఎల్. వెంకటేశ్వర్లు మరియు వారి మిత్ర బృందం సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి పూలమాలతో సన్మానించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
గూడూరు మండలంలో నెలకొని ఉన్న సమస్యలను త్వరితగతిన పరిష్కరించి ప్రశాంత వాతావరణంలో ఉండేలా చూడాలని వారు ఎస్సై రాజా కుళ్లాయప్పను కోరారు నూతన సంవత్సరం అందరికీ మేలు జరగాలని అందరి సహకారంతో రాబోవు రోజుల్లో గూడూరు మండలం అభివృద్ధి పథంలో ముందుకు దూసుకుపోవాలని ఆయన ఈ సందర్భంగా కోరారు.
అనంతరం గూడూరు మండలం చనుగొండ్ల గ్రామ నివాసి సీఐ శామారావు ని మాజీ జెడ్పిటిసిఎల్ వెంకటేశ్వర్లు మరియు మిత్ర బృందం సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలపడం జరిగింది.






