రిలే నిరహార దీక్షలకు మరతు తెలిపిన..U.T.F. నాయకులు…
కిరణ్ 24×7 న్యూస్:
కర్నూలు జిల్లా సహకార యూనియన్ ఆదేశాల మేరకు మూడు సంఘాల సిబ్బంది నిరాహార దీక్షల కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రాథమిక వ్యవసాయ సహాకార సంఘముల ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను. ప్రభుత్వం నెర వేర్చాలని రెండవ రోజున U.T. F. జిల్లా అధ్యక్షులు U.R.A. రవికుమార్, U.T.F. మండల గౌరవాధ్యక్షులు B. కిషోరకుమార్, మండల ప్రధాన కార్యదర్శి T. షబ్బీర్, సహాధ్యక్షులు ఈరన్న లు గూడూరు లోని శిబిరాన్ని సందర్శించి వారికి మద్దతు . ఈ కార్యక్రమంలో సహకార ఉద్యోగులైన సి. బెలగల్ సీఈఓ ఖాజా హుస్సేన్,గూడూరు సీఈవో శివకుమార్ రెడ్డి,పోలకల్ సీఈవో లక్ష్మన్న ,మధుసూదనారెడ్డి,చంద్ర శేఖర్,వెంకటేష్,శివ,సురేంద్ర,అనిల్ పాల్గొన్నారు.






