గ్రంథాలయానికి పురాణ గ్రంధాలు అందజేత…
కిరణ్ 24×7 న్యూస్ :
ప్రఖ్యాత ప్రవచనకర్త వద్దిపర్తి పద్మాకర్ రావు గరుడ పురాణం, శివ పురాణం, అగ్ని పురాణం, ఐశ్వర్య యోగం, కార్తీక పురాణం, శ్రీమద్దేవి భాగవతం, వేంకటేశ్వర విలాసం వంటి అనేక పురాణ గ్రంథాలను సామాన్యులు సులభంగా చదివి అర్థం చేసుకునే విధంగా సంక్షిప్తంగా, పారాయణకు అనుకూలంగా రచించడం జరిగింది.
ఈ విలువైన ఆధ్యాత్మిక గ్రంథాలను గూడూరు పట్టణ గ్రంథాలయ లైబ్రేరియన్ కవిత కి ప్రజల ఉపయోగార్థం అందజేయడం జరిగింది.
సనాతన ధర్మం, భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయాలు, పురాణ విజ్ఞానం నేటి తరానికి చేరాలన్న సద్భావనతో గురువు రచించిన ఈ గ్రంథాలు విద్యార్థులు, యువత, భక్తులు అందరూ చదవదగినవిగా ఉన్నాయి.
కావున గూడూరు ప్రజలు, ఆధ్యాత్మిక ఆసక్తి కలిగినవారు ఈ పురాణ గ్రంథాలను చదివి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందాలని మల్లేష్ నాయుడు, శివరాముడుతెలిపారు. వీరు లైబ్రేరియన్ కవిత కి పురాణాల పుస్తకాలను అందజేశారు. అదే విధంగా కర్నూల్ లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్ నందు పస్తుతం భాగవత సాప్తాహం జరుగుతున్నదని భక్తులు ఈ ప్రవచనాలు విని తరించాలని వారు కోరారు.






