*బస్సు యాత్రకు మేమంతా సిద్ధం!*

సీఎం జగన్మోహన్ రెడ్డి గారి బస్సు యాత్రలో భాగంగా రేపు అనగా 29-03-2024 శుక్రవారం రోజున ఎమ్మిగనూరు లో జరిగే సభకు మేమంతా సిద్ధంగా ఉన్నామని, అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని కోడుమూరు నియోజకవర్గ సమన్వయ కర్త, కుడా చైర్మన్ శ్రీ కోట్ల హర్షవర్ధన్ రెడ్డి గారు మరియు కోడుమూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ డా.ఆదిమూలపు సతీష్ గారు తెలిపారు..

ఎమ్మిగనూరు లో జరిగే బస్సు యాత్ర – సభకు కోడుమూరు నియోజకవర్గ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు, యువకులు అందరూ భారీ సంఖ్యలో పాల్గోని కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని కోరారు..

ఈ కార్యక్రమంలో జెడ్పిటిసి రాఘనాథ్ రెడ్డి, సొసైటీ చైర్మన్ కృష్ణారెడ్డి, మండల పార్టీ కన్వీనర్ రమేష్ నాయుడు, మల్లారెడ్డి, సోమన్న, ప్రవీణ్ కుమార్, సోషల్ మీడియా కన్వీనర్ మధుసూదన్, గిరి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు..