వాయిస్ క్లోనింగ్ సైబర్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి…గూడూరు ఎస్ఐ…
కిరణ్ 24×7 న్యూస్ :
వాయిస్ క్లోనింగ్ ద్వారా బంధువుల గొంతుతో ఫోన్ చేసి డబ్బులు అడిగే మోసాలు పెరుగుతున్నాయని ఇటువంటి సైబర్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని గూడూరు పోలీస్ స్టేషన్ ఎస్ఐ రాజా కుల్లాయప్ప తెలిపారు.
శుక్రవారం గూడూరు పట్టణంలో ని ఎస్సీ కాలనీలో కోడుమూరు సిఐ తబ్రీజ్ నేతృత్వంలో గూడూరు పోలీస్ స్టేషన్ ఎస్ఐ సిబ్బందితో ప్రజలకు సైబర్ నేరాలు మోసపూరిత ప్రకటనలు మరియు ఇతరత్రా మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ప్రజలకు పలు సూచనలు ఇచ్చారుAI వాయిస్ క్లోనింగ్ కు సంబంధించిన కొత్త స్కామ్‌లు జరుగుతున్నాయన్నారు.స్కామర్లు ఇప్పుడు గొంతులను క్లోన్ చేయడానికి AI ని ఉపయోగిస్తున్నారన్నారు.
తెలిసిన బంధువులు / స్నేహితుల గొంతులాగా మాట్లాడుతూ అత్యవసర సహాయం చేయడానికి పెద్ద మొత్తంలో డబ్బును త్వరగా బదిలీ చేయమని కోరతారన్నారు.
డబ్బు బదిలీ పూర్తయిన తర్వాత, బాధితులు తమ కుటుంబ సభ్యుడిని లేదా స్నేహితుడిని స్వయంగా వచ్చి కలిసినప్పుడు లేదా సంప్రదించినప్పుడు తాము మోసపోయామని గ్రహిస్తారన్నారు.
ముఖ్యంగా వారు అత్యవసర ఆర్థిక సహాయం కోరితే, ఏదైనా చర్య తీసుకునే ముందు వారి గుర్తింపును నిర్ధారించడానికి తెలిసిన, ధృవీకరించబడిన నంబర్ ద్వారా స్నేహితుడు/బంధువును సంప్రదించాలన్నారు.
* సోషల్ మీడియా , వాట్సాప్ , ఎస్‌ఎంఎస్ ద్వారా వచ్చే అనుమానాస్పద లింకులపై క్లిక్ చేయకూడదు.
* బ్యాంక్ ఖాతా వివరాలు, ఏటీఎం కార్డు నంబర్, ఓటీపీ వంటి వ్యక్తిగత సమాచారాన్ని తెలియని వ్యక్తులతో పంచుకోకూడదు.
* అనధికారిక వెబ్‌సైట్లు, యాప్‌ల ద్వారా కొనుగోళ్లు చేయవద్దు
* అధికారిక షాపింగ్ యాప్‌లు/వెబ్‌సైట్లను మాత్రమే ఉపయోగించండి
* సోషల్ మీడియాలో కనిపించే అతిగా తక్కువ ధరల ఆఫర్లను నమ్మవద్దు
*
ఏదైనా సైబర్ మోసానికి గురైనట్లయితే వెంటనే 1930 సైబర్ హెల్ప్‌లైన్ నంబర్‌కు ఫోన్ చేయాలి లేదా www.cybercrime.gov.in వెబ్‌సైట్‌లో ఫిర్యాదు నమోదు చేయాలని ప్రజలకు తెలియజేశారు.







