సహకార సంఘాల ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి..
కిరణ్ 24×7 న్యూస్ :
రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన సహకార సంఘాల నిరవధిక దీక్షలో భాగంగా కర్నూలు జిల్లా గూడూరు బ్రాంచ్ నందుగల సంఘాల సీఈఓ లు మరియు సిబ్బంది నిరవధిక దీక్షను నిర్వహించారు..
ఈ కార్యక్రమంలో ఉమ్మడి కర్నూలు జిల్లా సహకార సంఘాల ఉద్యోగుల కోశాధికారి బి. మహేంద్ర మాట్లాడుతూ సహకార సంఘాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని మా న్యాయమైన డిమాండ్స్ తీరే వరకు ఈ నిరవధిక సమ్మె ను కొనసాగిస్తామని అన్నారు..ఈ కార్యక్రమoలో గూడూరు సొసైటీ సీఈఓ శివ రెడ్డి, సి బెళగల్ సీఈఓ ఖాజా హుస్సేన్, పోలకల్ సీఈఓ లక్ష్మన్న, మరియు సిబ్బంది పాల్గొన్నారు..
సహకార సంఘాల డిమాండ్స్..
* జి. ఓ నెం. 36 వెంటనే అమలుపరిచి, 2019 మరియు 2024 పెండింగ్ లో వున్న వేతన సవరణలు చేయాలి, అప్పటివరకు మధ్యంతర భృతి ఇవ్వాలి
* ఉద్యోగులకు చెల్లించే గ్రాట్యుటీ సిలింగ్ 2 లక్షలు మాత్రమే చెల్లిస్తున్నారు. గ్రాట్యుటీ చట్టాన్ని అమలుపరిచి చట్ట ప్రకారం గ్రాట్యుటీ చెల్లింపు చేయాలి.
* సహకార సంఘాలలో పనిచేసే ఉద్యోగులకు కూడా ప్రభుత్వ ఉద్యోగులకు అమలు అయ్యే రిటైర్మెంట్ వయస్సు 62 సంవత్సరాలకు పెంచాలి.
* 2019 తరువాత సహకార సంఘాలలో చేరిన ఉద్యోగులను వెంటనే రెగ్యులర్ చేయాలి. వారికి కూడా జి.ఓ నెం.36 అమలు పరచాలి.
* ఉద్యోగులకు 5 లక్షలకు తక్కువ కాకుండా ఆరోగ్య భీమాను కల్పించి, ఉద్యోగి సర్వీస్ లో మరణిస్తే ఆ కుటుంబం ఆధారము లేకుండా పోతున్నందున ప్రతి ఉద్యోగికి 20 లక్షలు టర్మ్ ఇస్సూరెన్స్ పాలసీ చేయించి కుటుంబాలకు భరోసా కల్పించాలి.
* అనేక సంఘాలలో ఉద్యోగుల జీతభధ్యలను డ్యూటు పద్దు నందు ఉంచడం జరిగింది, ఈ డ్యూటు పద్దులను రద్దు చెయ్యాలి.
* పి.ఏ.సి.ఎస్ ల ద్వారా కాకుండా,డి.సి.సి.బి ల ద్వారా రైతులకు డైరెక్ట్ గా ఋణాలు ఇస్తున్నారు. దీనివలన పి.ఏ.సి.ఎస్ నిర్వీర్యం అయిపోవీచున్నని. ఈ విధానాన్ని మార్పు చేసి అన్నీ సేవలు సహకార సంఘాల ద్వారా రైతులకు అందేవిధంగా చర్యలు తీసుకోవాలి.
* సంఘాలు చెల్లించిన షేరు ధనంపై కనీసం 6% డివిడెంట్ లేదా కనీసం 6% వడ్డీ చెల్లించాలి. దీనిపై చర్యలు తీసుకోవాలి.
* సహకార సంఘాల సిబ్బంది బదిలీలకు మేము వ్యతిరేకం కాదు. ఈ బదలీలు జరగాలంటే డి.ఎల్.ఎస్.ఎఫ్ ను అప్కాబ్, డిసీసీబీ లు, PACS లతో ఏర్పాటు చేసి 3 సువర్సరాల నిబందన కాకుండా నిరవదకంగా కొనసాగించి బదిలీలు చేయాలి.
* Capacity to pay నిభందనలకు సంబంధం లేకుండా ఉద్యోగుల జీతభత్యాలను DLSF ద్వారా నిరవధికంగా చెల్లించాలి.
* ప్రస్తుతము పనిచేయుచున్న Assistant Executives Clerks లేదా కంప్యూటర్ ఆపరేటర్ లను సీనియార్టీ ప్రాతిపదికిన జిల్లాలో ఖాళీగా ఉన్న సి.ఇ.ఓ పదవులను వీరితో భర్తీ చేసుకోవాలి.
* Assistant Executives DLEC ద్వారా రిక్రూట్మెంట్ జరగాలి.







