కిరణ్ 24×7 న్యూస్:కే డి సి సి బ్యాంకులలో రుణాలు తీసుకొని మర ణించిన వారికి ప్రభుత్వం సహకార రాజీ పరిష్కార పథకం అమలు చేసిందని ఈ పథకాన్ని సద్విని యోగం చేసుకోవాలని కర్నూలు కేడీసీసీ బ్యాంకు సిఓ రామాంజనేయులు పేర్కొన్నారు. గూడూరు పట్టణంలోని బ్రాంచ్ కార్యాలయంలో శనివారం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘ అధ్యక్షులు..బ్యాంకు సిబ్బందితో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ మరణించిన రుణ గ్రహీతల రుణ విముక్తి కొరకు సహకార రాజీ పరిష్కార పథకాన్ని ప్రభుత్వం అమలు చేసిందన్నారు. బకాయిల రుణాల మొత్తాన్ని ఈనెల 31 నాటికి చెల్లించి అర్హత మేరకు అపరాధ వడ్డీ పై మినహాయింపు పొందవచ్చునన్నారు. ఈ అవకాశాన్ని రుణ గ్రహీతలు వినియోగించుకొనిఈ నెల 31 వరకు గడువు ఉన్నందున తమ బకాయి లను ఎటువంటి వడ్డీ లేకుండా చెల్లించాలని ఆయన తెలిపారు.. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో అధ్యక్షులు దానమయ్య, పోలకల్ చిన్న తిమ్మప్ప, గూడూరు,సి. బెళగల్ బ్యాంకు సీఈ ఓలు, సిబ్బంది పాల్గొన్నారు.






