పింఛన్ల పంపిణీలో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు జె.సురేష్.
కిరణ్ 24×7 న్యూస్ :
ముఖ్యమంత్రివర్యులు .నారా చంద్రబాబునాయుడు, ఐటీ,విద్యాశాఖ మంత్రివర్యులు . నారా లోకేష్ బాబు ,తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు.పల్లా శ్రీనివాసరావు ,కోడుమూరు నియోజకవర్గ శాసనసభ్యులు . బొగ్గుల దస్తగిరి , కర్నూలు కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ .డి.విష్ణువర్ధన్ రెడ్డి ఆదేశాల మేరకు పేదల సేవలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ కోడుమూరు నియోజకవర్గం గూడూరు మండలం మల్లాపురం గ్రామంలో గూడూరు మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు జె.సురేష్ పాల్గొని పింఛన్ల పంపిణీ చేయడం జరిగింది.
ఈ సందర్భంగా జె.సురేష్ మాట్లాడుతూ వృద్ధులు/ వితంతువులకు 4000 రూపాయలు, దివ్యాoగు లకు/ కుష్టి వ్యాధిగ్రస్తులకు 6000 రూపాయలు, కిడ్నీ/ కాలేయము/ తల సేమియా బాధితులకు 10000 రూపాయలు, పూర్తి వైకల్యం ఉన్నవారికి 15000 రూపాయలను ఒకరోజు ముందుగానే ప్రతి ఇంటికి వెళ్లి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ చేయడం జరుగుతుంది. అర్హత కలిగి పెన్షన్లు లబ్ధి పొందుతున్న వారు రాష్ట్రంలో దాదాపుగా 65 లక్షల మంది ఉన్నారు వీటి కొరకు ప్రభుత్వం ప్రతినెల 2800 కోట్ల రూపాయలను ఖర్చు చేయడం జరుగుతుందని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో నాగార్జున రెడ్డి, జగదీశ్వరరెడ్డి, సుల్తాన్, కాశీం, పంచాయతీ కార్యదర్శి,సచివాలయ సిబ్బంది పాల్గొనడం జరిగింది.







