kiran24×7news ….నేడు కోడుమూరు పట్టణంలో ఆర్యవైశ్య సంఘం జిల్లా ఉపాధ్యక్షులు తెలుగుదేశం పార్టీ నాయకులు లింగం బాలకృష్ణయ్య ఆధ్వర్యంలో .మాజీ రాజ్యసభ సభ్యులు మాజీమంత్రి టీజీ వెంకటేష్ గారిని ఆర్యవైశ్య సంఘం సభ్యులు పట్టు శాలువాలతో పూలదండలతో ఘనంగా సన్మానించారు. ఎమ్మిగనూరులో ఆర్యవైశ్య సంఘం జిల్లా యువజన సంఘం కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరై కర్నూలుకు వెళ్తున్న సందర్భంగా కోడుమూరులో ఆర్యవైశ్యులు ఘనంగా స్వాగతం పలికి సన్మానించారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున బాణసంచా కాల్చి టీజీ వెంకటేష్ కు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు లింగం లక్ష్మయ్య శెట్టి . పట్టణ సంఘం అధ్యక్షులు కలికె నాగరాజు .కళ్యాణమండపం ప్రెసిడెంట్ పట్నం సుధాకర్. మాజీ పట్టణ అధ్యక్షులు ఎల్ లక్ష్మణ స్వామి. మాజీ మండల అధ్యక్షులు మురహరి నాగయ్య. అనంత రామకృష్ణగుప్త. లింగం సురేష్. సి నరేంద్ర. బంకు గిడ్డయ్య. రవీంద్ర .శ్రీకాంత్ .పాలకుర్తి మురళీకృష్ణ . కిషోర్. చిలుకూరు వెంకటేష్. తదితరులు పాల్గొన్నారు.






