సిద్ధం సభ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కార్యకర్తలంతా తరలిరావాలంటూ పిలుపునిచ్చేందుకు గూడూరు పట్టణానికి విచ్చేసిన కుడా చైర్మన్ హర్షవర్ధన్ రెడ్డి కోడుమూరు వైసిపి పార్టీ అభ్యర్థి డాక్టర్ ఆదిమూలపు సతీష్ కు గూడూరు పట్టణ మున్సిపాలిటీ చైర్మన్ జుంపాల వెంకటేశ్వర్లు వైస్ చైర్మన్ పి ఎన్ అస్లాం మరియు మాజీ జెడ్పిటిసి ఎల్ వెంకటేశ్వర్లు మరియు స్థానిక నాయకులు నీటి సమస్యలను వారి దృష్టికి తీసుకువెళ్లారు. గొర్రెల మరియు పశువుల కు త్రాగునీటిని అందించేందుకు పశువుల కోసం బుడగల వాని చెరువుకు మరియు రజకుల వృత్తి కోసం కుమ్మరి గుంటలకు ఎల్ఎల్సీ ద్వారా ఐదు రోజులు నీళ్లు విడుదల చేయాలని ఈ సందర్భంగా వారికి తెలియజేశారు. ఈ సందర్భంగా కుడా చైర్మన్ మాట్లాడుతూ పై అధికారులతో మాట్లాడి నీటి సమస్య పరిష్కారానికి తగు చర్యలు తీసుకుంటామని ఆయన వారికి హామీ ఇచ్చారు. కార్యక్రమంలో రెండవ వైస్ చైర్మన్ బోయ లక్ష్మణ్ పట్టణ కన్వీనర్ ఆబేలు కౌన్సిలర్లు మద్ది కుమార్ కలాం ఖలీల్ మరియు స్థానిక కౌన్సిలర్లు పట్టణ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.