kiran24×7news ….కర్ణాటక నుండి శ్రీశైలం వెళ్లే పాదయాత్రలకు మన గూడూరు పట్టణ శ్రీ చింతల ముని రంగస్వామి దేవాలయం దగ్గర రేపటినుండి అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు మాజీ జెడ్పిటిసి ఎల్.. వెంకటేశ్వర్లు మరియు శ్రీ నీలకంఠేశ్వర భక్తి బృందం వారు తెలిపారు. ఈ కార్యక్రమం దాతల సహకారంతో గత 25 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. ఈ సంవత్సరం కూడా ఉగాది పర్వదిన సందర్భంగా కర్ణాటక మహారాష్ట్ర నుండి పాదయాత్రకులు గూడూరు మీదుగా శ్రీశైలం చేరుకుంటానరని మన వంతు బాధ్యతగా మన గ్రామంలో కూడా మీ అందరి సహకారంతో ఈ అన్నదాన కార్యక్రమం చేపట్టినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజకీయ పార్టీలకు అతీతంగా అందరూ పాల్గొని విజయవంతం చేద్దామని ఈ సందర్భంగా వారు కోరారు…






