*వైసీపీ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలోకి చేరిన నూతనపల్లె గ్రామస్తులు..*
*కోడుమూరు నియోజకవర్గ ఎమ్మెల్యేగా
గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతున్న మాజీ ఎమ్మెల్యే శ్రీ పరిగెల మురళీకృష్ణ గారు..*
తేదీ : 31-03-2024, వేదిక : మురళీకృష్ణ అన్నగారి స్వగృహం నందు,వెంకటరమణ కాలనీ, కర్నూలు నగరం,కర్నూలు జిల్లా.
*ఈరోజు కోడుమూరు నియోజకవర్గం కర్నూలు మండలం నూతనపల్లె గ్రామానికి చెందిన వైసీపీ పార్టీ నాయకులు వీరేష్,జగన్ ఆధ్వర్యంలో ఉమాకాంత్,పవన్,విజయ్,బాబు, వర్ధన్,ఉస్మాన్ తదితరులు వైసీపీ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలోకి చేరిపోయారు వీరందరికీ కాంగ్రెస్ పార్టీ కర్నూలు జిల్లా నాయకులు కోడుమూరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే శ్రీ,,పరిగెల మురళీ కృష్ణ గారు కాంగ్రెస్ పార్టీ కండువ కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు..*
ఈ సందర్బంగా కాంగ్రెస్ పార్టీలో చేరిన తరువాత వారు మాట్లాడుతూ పరిగెల మురళీకృష్ణ గారు దాదాపుగా 15 సంవత్సరాలు కోడుమూరు నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే నాయకుడని ఎక్కడో నాన్ లోకల్ నుంచి వచ్చిన వారికి మద్దతు ఇచ్చి వారి పల్లకి లు మోయడానికి నియోజకవర్గంలో మేం సిద్ధం గా లేమని తెలిపి ఈసారి కోడుమూరు నియోజకవర్గ అసెంబ్లీ ఎమ్మెల్యే అభ్యర్థిగా శ్రీ పరిగెల మురళీకృష్ణ గారిని గెలిపించుకోవాల్సిన అవసరం ప్రతిఒక్కరికి మీద ఉందని అందరం మద్దతుగా నిలబడి శ్రీ పరిగెల మురళీకృష్ణ గారిని గెలిపించుకుందామని వారు తెలిపారు..






