3వ తేదీ నుంచి వార్డు సచివాలయాల్లో పింఛన్ల పంపిణీ..
kiran24×7news ..
ఆందోళన వద్దు.. అన్ని ఏర్పాట్లు చేసాం : కమిషనర్ వి.దివాకర్ రెడ్డి
గూడూరు : గూడూరు నగరపంచాయతి పరిధిలో సామాజిక పింఛన్ల పంపిణీ కోసం ఎన్నికల కమిషన్, జిల్లా కలెక్టర్ వారి మార్గదర్శకాల ప్రకారం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు., పించను లబ్దిదారులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కమిషనర్ వి. దివాకర్ రెడ్డి గారు తెలిపారు. ఏప్రిల్ 3వ తేదీ నుండి సంబంధిత వార్డు సచివాలయాల్లో వార్డు కార్యదర్శుల ద్వారా సామాజిక పింఛన్ల పంపిణీ జరుగుతుందని ఈ సందర్భంగా గూడూరు నగర పంచాయతీ కమిషనర్ పేర్కొన్నారు.






