అధికారుల నిర్లక్ష్యం… ఇష్టానుసారంగా ప్రైవేటు సంస్థ వ్యవహారం.

kiran24×7news..
సుంకేసుల జలాశయంలో నీటి నిల్వలు లేకపోవడంతో కర్నూలు నగరానికి త్రాగునీటి సమస్యను పరిష్కరించేందుకు జిల్లా అధికారులు  త్రాగునీటి అవసరాల నిమిత్తం గాజులదిన్నె జలాశయం నుండి త్రాగునీటిని ఎల్ఎల్ సి కాలువ ద్వారా కర్నూల్ నగరానికి సరఫరా చేసేందుకు చర్యలు చేపట్టారు. అయితే ఓ ప్రైవేటు సంస్థ ..(గ్రీన్ కో సంస్థ) వారు గాలి మరలను ఏర్పాటు చేసేందుకు గాను తమ వాహనాల రాకపోకలకు వీలుగా గూడూరు మండలం చనుగొండ్ల గ్రామంలోని ఎల్ఎల్ సి కాలువ లో రెండు చిన్న సైజు పైపులను ఏర్పాటు చేసి కాలువపై మొత్తం మట్టితో కప్పి వేసి రహదారిని  ఏర్పాటు చేసుకున్నారు. దీంతో అధికారులు గాజులదిన్నె జలాశయం నుండి విడుదల చేసిన నీరంతా చనుగుండ్ల గ్రామంలోని ఎల్ఎల్సీ కాల్వలోనె నిలిచిపోయే దుస్థితి ఏర్పడింది. ఈ ప్రైవేటు సంస్థ వారు ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ ప్రజల దాహార్తిని తీర్చేందుకు అధికారులు ఏర్పాటు చేసిన త్రాగునీటి సరఫరాను ఏకంగా మట్టితో కప్పేసి తమ వ్యవహారాలు నడిపిస్తున్న అధికారులు పట్టించుకోకపోవడం గమనార్హం.. గత కొన్ని రోజుల క్రితమే పెంచికలపాడు చెరువును ఆక్రమించి చెరువుకు సంబంధించిన కరకట్టలను తొలగించి తమ వాహనాల రాకపోకలకు వీలుగా ఈ ప్రైవేటు సంస్థ వారు రహదారి వేసుకోవడంతో స్పందించిన సిపిఐ సిపిఎం నాయకులు గ్రామ ప్రజలతో కలిసి ఆందోళనలు చేసి వారి ఆట కట్టించి చెరువును యధా స్థితికి తీసుకువచ్చారు.. ఓ ప్రైవేటు సంస్థ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న సంబంధిత అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో అర్థం కాని పరిస్థితి నెలకొంది. అధికారులకు ముడుపులు బాగా ముట్టాయేమో!!! అందుకే వారి ఆగడాలను అడ్డుకోకుండా అధికారులు చోద్యం చూస్తున్నారని స్థానిక ప్రజలు అనుకుంటున్నారు. ఇకనైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి ఈ ప్రైవేట్ సంస్థ ఆగడాలను అరికట్టకపోతే కాలువలు చెరువులు మరియు కల్వర్టులు అన్ని తుడుచుకుపోయే పరిస్థితి లేకపోలేదు..