కాంగ్రెస్ పార్టీలోకి భారీగా చేరికలు…!! కంచుకోటపై కాంగ్రెస్ జండా ఎగురవేద్దాం — కె. బాబురావు kiran24×7news :-
ఈరోజు కోడుమూరు నియోజకవర్గం సి.బెళగల్ పట్టణం,బురందొడ్డి,క్రిష్ణదొడ్డి గ్రామాలకు చెందిన వైసీపీ పార్టీ,టీడీపీ పార్టీలకు చెందిన నాయకులు బంగి మద్దిలేటి,అలీ బాష,మద్దిలేటి, షేక్ష,గోవిందు,గోపాల,వెంకటేష్,చిన్న గోపాల,బురందొడ్డి గోవిందు,వెంకటేష్,రంగడు,వెంకటేష్ తదితరులను జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కె.బాబురావు గారు,జిల్లా ఇంచార్జ్ రామస్వామి గార్లు కాంగ్రెస్ పార్టీ కర్నూలు జిల్లా నాయకులు కోడుమూరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే శ్రీ,,పరిగెల మురళీ కృష్ణ గారి సమక్షంలో వీరందరికీ కాంగ్రెస్ పార్టీ కండువ కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు..
*ఈ సందర్బంగా జిల్లా అధ్యక్షులు కె.బాబురావు గారు మాట్లాడుతూ రాబోయే రోజులు కాంగ్రెస్ పార్టీవేనని కోడుమూరు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీకి కంచుకోటనని ప్రతి ఒక్కరు ఆలోచించి ఓటు వేయాలని సామాన్య ప్రజలను కూడా అక్కున చేర్చుకొని వారికి అండగా నిలిచే మనసున్న నాయకుడు మన కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ Muralikrishna Parigela గారని ఆయనను గెలిపించుకుంటే నియోజకవర్గం అభివృద్ధి చెందడం ఖాయమని అందుచేత ఎవరో ఆదేశిస్తే ఓటు వేయవదని పని చేసే శ్రీ పరిగెల మురళీకృష్ణ గారికి ఓటు వేయాలని కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు కె.బాబు రావు గారు సూచించారు.






