కోడుమూరులో అఖండ మెజారిటీతో జెండా ఎగురవేస్తాం…
kiran24×7news :-
కోడుమూరు నియోజకవర్గంలో టిడిపి పార్టీ జెండాను ఈసారి అఖండ మెజార్టీతో ఎగుర వేస్తామని జిల్లా నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు. బుధవారం గూడూరు పట్టణంలోని టిడిపి పార్టీ పట్టణ అధ్యక్షులు గజేంద్ర గోపాల్ నాయుడు నివాసానికి కర్నూలు పార్లమెంటు టిడిపి అభ్యర్థి నాగరాజు, ఎమ్మెల్యే అభ్యర్థి బొగ్గుల దస్తగిరి మరియు స్థానిక నేతలతో కలిసి ఆయన ఊరేగింపుగా వెళ్లారు. స్థానిక ఏబీఎన్ చర్చి రహదారి నుండి పట్టణ అధ్యక్షులు గజేంద్ర గోపాల్ ఇంటి వరకు మేల తాళాలతో బాణాసంచాతో ఊరేగింపుగా తరలివచ్చారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షులు కడియాల గజేంద్ర గోపాల్ నాయుడు మాట్లాడుతూ టిడిపి పార్టీ ప్రకటించిన ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల విజయం కోసం కృషి చేస్తానని అందరూ కలిసికట్టుగా పనిచేసి ఎన్నికల్లో ఘనవిజయం సాధిస్తామని తెలిపారు. అనంతరం స్థానిక మైనారిటీ నాయకులు చికన్ వహీద్ ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమానికి తరలి వెళ్లారు. అక్కడ ఏర్పాటుచేసిన బహిరంగ సభలో నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ గూడూరు పట్టణ ముస్లిం మైనార్టీ ప్రజలకు తన వంతుగా అభివృద్ధికి కృషి చేస్తానని పట్టణంలో నిలిచిపోయిన షాది ఖానా నిర్మాణాలను టిడిపి హయాంలో కచ్చితంగా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులు మాట్లాడుతూ టిడిపి హయాంలోనే ముస్లింల అభివృద్ధి సాధ్యమవుతుందని రాబోవు ఎన్నికల్లో టిడిపి పార్టీని అఖండ మెజార్టీతో గెలిపించాలని వారు మైనార్టీ సోదరులను కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు మాజీ వైస్ చైర్మన్ కురుకుంద రామాంజనేయులు, జిల్లా నాయకులు డి సుందర రాజు, నాయకులు రేమట వెంకటేశ్వర్లు, వీర,పౌలు, సృజన్, మన్నన్ భాష, నాగరత్నరావు, పైగేది రవి, చంటి, ఇసాక్, చిలుక శ్రీను, కృష్ణ, నాగప్ప యాదవ్, కౌన్సిలర్లు బుడ్డoగలి, నాయకులు, స్థానిక నేతలు,
కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.






