kiran24x7news:-

కర్నూలు 40వ వార్డులో కార్పొరేటర్ విక్రమ్ సింహరెడ్డి ఆధ్వర్యంలో ఇంటింటికి ప్రచారం నిర్వహించిన కోడుమూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి డా.ఆదిమూలపు సతీష్ గారు..ఓటర్లతో పార్టీకి గెలుపును అందించాలని కోరుతున్న ఎమ్మెల్యే అభ్యర్థి

ఈ సందర్భంగా మాట్లాడుతూ జగనన్న ప్రభుత్వం ద్వారా అనేక సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు అందుతున్నాయి కావున మళ్ళీ సిఎంగా జగనన్న గారినే గెలిపిస్తేనే ప్రజలకు మంచి జరుగుతుందని అన్నారు.. చంద్రబాబు చేసిన కుట్ర వల్ల లబ్దిదారులకు నేరుగా ఇంటికి వస్తున్న పెన్షన్ లు ఆగిపోయాయని, వికలాంగులకు, వృద్దులు కార్యాలయాల చుట్టూ తిరిగే పాత రోజులు వచ్చేలా చేసిన చంద్రబాబు కు, వారి కూటమికి తగిన బుద్ధి ఓట్ల ద్వారా చెప్పాలని పిలుపునిచ్చారు..

అలాగే రానున్న ఎలక్షన్ లో ఎంపీ అభ్యర్థి బివై రామయ్య గారికి, ఎమ్మెల్యే అభ్యర్థి డా.ఆదిమూలపు సతీష్ గారిని ఓటు వేసి గెలిపించాలని కోరారు..

ఈ కార్యక్రమంలో లక్ష్మీకాంత్ రెడ్డి, గిరి ప్రసాద్, రాము, మహేష్, ఇర్షద్, అఖిల్, తులసి, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు