kiran24×7news :-
అధిష్టానం పునరాలోచన చేసి కోడుమూరు అసెంబ్లీ టికెట్టును తనకు కేటాయించాలని
నీతికి నిజాయితీకి మరో పేరు అయినటువంటి దామొదరం సంజీవయ్య గారు, దామొదరం మునుస్వామి గారు వేసిన పునాదుల మీద తాను పని చేస్తూ సుమారు 80 ఏళ్లుగా మా కుటుంబం కాంగ్రెస్ పార్టీకి సేవలు అందిస్తూనే ఉందని ఇకనైనా హై కమాండ్ పునరాలోచన చేసి తనకు కోడుమూరు నియోజకవర్గం అసెంబ్లీ టికెట్ ను కేటాయించాలని సి.బెళగల్ లో తన మద్దతుదారులతో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో పిసిసి ప్రధానకార్యదర్శి దామొదరం రాధాకృష్ణమూర్తి గుర్తు చేశారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా కాంగ్రెస్ పార్టీలో ఉండి పనిచేస్తూ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకుంటూ పోతూనే ఉన్నానని,నా సేవలను గుర్తించి 2019లో కాంగ్రెస్ పార్టీ నాకు కోడుమూరు ఎమ్మెల్యే టికెట్ కేటాయించగా ఉమ్మడి కర్నూలు జిల్లాలోనే తనకు అత్యధికంగా ఓట్లు వచ్చాయని ఈ సందర్భంగా తెలిపారు.
అదేవిధంగా రాహుల్ గాంధీ గారు సంజీవయ్య గారి నివాసాన్ని సందర్శించినప్పుడు సంజీవయ్య గారి నీతి, నిజాయితీని, నిబద్ధతను తెలుసుకొని ఆశ్చర్యపోయి మీలాంటివారు పార్టీ కోసం పని చేస్తూ సంజీవయ్య భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకుపోవాలని చెబుతూ నాకు మంచి రాజకీయ భవిష్యత్తు ఇచ్చి రాజకీయంగా ఉన్నత స్థాయిలో ఉంచుతానని హామీ ఇచ్చారని అన్నారు.
రాష్ట్ర నాయకత్వం కుళ్ళి పోయిన కుల రాజకీయ వ్యవస్థను పార్టీకి అంటగట్టి పార్టీ కోసం పని చేసినవాళ్ళను కాదని పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన వాళ్లకు టికెట్ కేటాయించడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు.
ఐతే ఉన్నపళంగా బయటి నుండి వచ్చిన వ్యక్తికి టికెట్ ఇచ్చి పార్టీ కోసం పనిచేసిన నన్ను తప్పించి అన్యాయం చెసారని. పార్టీ హై కమాండ్ పై ఉన్న నమ్మకంతో పాటు మా కుటుంబం గురించి,80 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ కి మేము చేస్తున్న సేవల గురించి అధిష్టానం ఆలోచించి సరైన నిర్ణయం తీసుకుంటుందని ఆశిస్తున్నానని తెలిపారు.
సమావేశంలో జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి దాసరి శశిధర్ కుమార్, జిల్లా జాయింట్ సెక్రెటరీ మా భాష, బెలగల్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున, మాజీ మండల కాంగ్రెస్ అధ్యక్షులు రామాంజనేయులు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు దాసరి మద్దిలేటి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.






