kiran24x7news:-
కర్నూలు మండలం బి-తాండ్రపాడు గ్రామపంచాయితీలో నియోజకవర్గ సీనియర్ నాయకులు శ్రీ విష్ణువర్ధన్ రెడ్డి గారి ఆదేశానుసారం కోడుమూరు నియోజకవర్గ తేదేపా,జనసేన,బీజేపీ బలపరిచిన ఉమ్మడి అభ్యర్థి బొగ్గుల దస్తగిరి గారు ప్రతి ఇంటికి తెలుగుదేశం కార్యక్రమంలో ప్రతి అమ్మని,అక్కని,అన్నని కలవడం జరిగింది.
కార్యకర్తలతో కలిసి ప్రచారం చేస్తున్న అభ్యర్థి బొగ్గుల దస్తగిరి.
ప్రతి వార్డులలో పర్యటించిన బొగ్గుల దస్తగిరి గారికీ ప్రజలు వారి సమస్యలను చెప్పుకున్నారు.రాబోయే రోజుల్లో మన పాలనలో అన్ని సమస్యలు మనమే పరిష్కరించుకుదమని వారికి స్పష్టం చేశారు. ఈ ఆరాచకపు పాలనను అంతం పలకాలని కోరారు. ప్రతి ఇంటికి వెళ్ళి చంద్రబాబు ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు వివరించారు.
_♻️ ఈ కార్యక్రమంలో సర్పంచుల సంగం అధ్యక్షులు అకేపోగు జయన్న,ఎంపీటీసీ మద్దిలేటి,మాజీ సర్పంచ్ శ్రీను,మాజీ ఎంపీటీసీ మదన్న,ఉప సర్పంచ్ చాంద్ భాష,తెలుగు యూత్ అధ్యక్షులు పెరపోగు రాజు, గొల్ల వెంకటేష్,కిరణ్,వనుములయ్య,ఎల్ల కృష్ణ,యేసు,రత్నం, జీ.వెంకటేష్,కిషోర్,మోహన్,యూసఫ్,చిన్న మద్దిలేటి,కుమార్,రంగస్వామి గౌడ్,వెంకటేశ్వర్లు,రాంబాబు,సురేంద్ర,ఆసుర్ ఖాన్,జమల్ అహ్మద్,రియాజ్ ఖాన్, మలేఖాన్,అన్వర్ బాష,షిక్షవలి,మున్నా తదితర నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు .






