kiran24x7news:-
కోడుమూరు నియోజకవర్గంలో ఈసారి మళ్లీ వైసీపీ పార్టీ జెండా ఎగురవేయడం ఖాయం అంటూ కోడుమూరు ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ ఆదిమూలపు సతీష్ తెలిపారు గురువారం కర్నూలు మండలంలోని నందనపల్లి, మిలిటరీ కాలనీ, భూపాల్ నగర్, వెంకయపల్లి గ్రామాలలో వైఎస్సార్ సీపీ ఇంటింటికి ప్రచారం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో కుడా చైర్మన్ కోట్ల హర్షవర్ధన్ రెడ్డి గారు, కోడుమూరు మాజీ ఎమ్మెల్యే మణిగాంధీ గారు, మరియు కోడుమూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి డా.ఆదిమూలపు సతీష్ గారు పాల్గొని ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయా గ్రామాలకు చెందిన వైసిపి పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు నాయకులకు శాలువా, పూలదండలతో సత్కరించి, విధుల్లో బాణసంచాలు కాల్చి ఘనంగా స్వాగతం తెలిపారు..

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ జగనన్న ప్రభుత్వం ద్వారా అనేక సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు అందుతున్నాయి కావున మళ్ళీ సిఎంగా జగనన్న గారినే గెలిపిస్తేనే ప్రజలకు మంచి జరుగుతుందని అన్నారు.. చంద్రబాబు చేసిన కుట్ర వల్ల లబ్దిదారులకు నేరుగా ఇంటికి వస్తున్న పెన్షన్ లు ఆగిపోయాయని, వికలాంగులకు, వృద్దులు కార్యాలయాల చుట్టూ తిరిగే పాత రోజులు వచ్చేలా చేసిన చంద్రబాబు కు, వారి కూటమికి తగిన బుద్ధి ఓట్ల ద్వారా చెప్పాలని పిలుపునిచ్చారు..
అలాగే రానున్న ఎలక్షన్ లో ఎంపీ అభ్యర్థి బివై రామయ్య గారికి, ఎమ్మెల్యే అభ్యర్థి డా.ఆదిమూలపు సతీష్ గారిని ఓటు వేసి గెలిపించాలని కోరారు..

ఈ కార్యక్రమంలో జెడ్పిటిసి ప్రసన్న కుమార్, వైస్ ఎంపిపి నెహేమియా, నందనపల్లి గ్రామ సర్పంచ్ మాధవి – వెంకటేష్, గొందిపర్ల సర్పంచ్ శ్రీనివాసులు, నందనపల్లి ఎంపిటిసి శేఖర్, ఉల్చాల వాసు, మండల కన్వీనర్ మహబూబ్ బాషా, వినయ్ కుమార్ రెడ్డి, ఎంపిటిసి హనుమంతు, లక్ష్మీకాంత్ రెడ్డి, రైతు రాష్ట్ర విభాగం కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి, శేఖర్ రెడ్డి, వెంకటేష్ రెడ్డి, ఎల్లమ్మ టెంపుల్ చైర్మన్ మహేశ్వర రెడ్డి, ఆంజనేయులు గౌడ్, శేషి రెడ్డి, సంపత్ కుమార్, వెంకటేశ్వర్లు, రాంమోహన్ రెడ్డి, చిన్న లక్షన్న, మోహన్ బాబు, బోజ్జన్న, కేశవరెడ్డి, అఖిలేశ్వర రెడ్డి, కోటిరెడ్డి, వెంకటేష్, ఎల్లమ్మ దేవాలయ బోర్డు మెంబర్ మధు శేఖర్, పడిదంపాడు వెంకటేష్, సచివాలయ కన్వీనర్ అనీల్ బాషా, భాస్కర్, ప్రసాద్, సురేష్, చక్రపాణి రెడ్డి, దావీద్, ప్రభుదాస్, మధుసూదన్, శేఖర్, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.






