ఏ ఆపదవచ్చిన నేను మీకు తోడుంటా..!*
-డాక్టర్.ఆదిమూలపు సతీష్ (కోడుమూరు ఎమ్మెల్యే అభ్యర్థి)
kiran24x7news:-
డి వెంకటేశ్వర్లు అనే డయాలసిస్ పేషెంట్ కర్నూలు అత్యవసర చికిత్స పొందుతూ ఉండడంతో ఆయనకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కుటుంబీకులు కోరిన వెంటనే కోడుమూరు ఎమ్మెల్యే అభ్యర్థి డా.ఆది మూలపు సతీష్ గారు ప్రచారంలో భాగంగా గూడూరు మండలం కే నాగలాపురం గ్రామంలో ప్రచారం నిర్వహిస్తూ ఉన్నప్పటికీ సమాచారం తెలిసిన వెంటనే కార్యక్రమం ముగిసిన వెంటనే నేరుగా ఆసుపత్రి కి చేరుకుని బాధితులను పరామర్శించి కుటుంబ సభ్యులకు మెరుగైన మెరుగైన వైద్య సేవలు అందించేందుకు తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. వైద్యులను కలిసి బాధితునికి మెరుగైన వైద్య సేవలు సకాలంలో అందించాలని కోరారు. ఏ అవసరం ఉన్న ఫోన్ చేయొచ్చని చెప్పి ఫోన్ నెంబరు ద్వారా నేరుగా సమాచారం తెలుపాలని వారిని కోరారు
ఫోన్ చేసిన వెంటనే స్పందించి, ఆసుపత్రికి వచ్చి, వైద్యం అందించిన కోడుమూరు ఎమ్మెల్యే అభ్యర్థి డా.ఆదిమూలపు సతీష్ గారికి, పేషేంట్ బంధువులు కృతజ్ఞతలు తెలిపారు..






