kiran24x7news:-
■ *కోడుమూరు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తాము*■
●- కుడా చైర్మన్ కోట్ల హర్షవర్ధన్ రెడ్డి గారు
●- కోడుమూరు ఎమ్మెల్యే అభ్యర్థి డా.ఆదిమూలపు సతీష్ గారు..
ప్రచారంలో భాగంగా ఈరోజు సి.బెళగల్ మండలం చింతమానిపల్లె, తిమ్మందొడ్డి, పలుకుదొడ్డి, సంగాల గ్రామాలలో ఇంటింటికీ ప్రచారం నిర్వహించిన కోడుమూరు నియోజకవర్గ సమన్వయకర్త, కుడా చైర్మన్ కోట్ల హర్షవర్ధన్ రెడ్డి గారు మరియు కోడుమూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి డా.ఆదిమూలపు సతీష్ గారు..
ఈ సందర్భంగా కుడా చైర్మన్ కోట్ల హర్షవర్ధన్ రెడ్డి గారు, కోడుమూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి డా.ఆదిమూలపు సతీష్ గారు మాట్లాడుతూ ‘మీ ఇంట్లో మేలు జరిగితేనే ఓటు వేయమని చెప్పిన దమ్మున్న ఏకైక నాయకుడు’ జగన్ గారని, జగనన్న ప్రభుత్వం ద్వారా ప్రతి ఇంటికి అనేక పథకాలను అందించారని, రైతులకు, వృద్దులకు, వికలాంగులకు, మహిళలకు, పిల్లలకు, వృత్తి చేసుకునే వ్యక్తులకు ఇలా ప్రతి ఒక్కరికి ఏదో రకంగా వారి ఇంటికి లబ్ది చేకూర్చింది జగన్ గారు మాత్రమే అని అన్నారు.. చంద్రబాబు కు, తన కూటమికి స్టార్ కంపెయినర్ పవన్ కళ్యాణ్ లాంటి వారు ఉన్నరేమో, కానీ జగన్ గారికి ఆబ్దిపొందిన సామాన్యులే స్టార్ కంపెయినర్లు అని అన్నారు.. చంద్రబాబు వాలింటర్ల పై కుట్రతో వృద్దులకు, వికలాంగులకు ఇంటికి వచ్చే పెన్షన్లు రాకుండా అడ్డుకొని రాక్షస ఆనందం పొందుతున్న చంద్రబాబు, కూటమిని ఓడించి బుద్ది చెప్పాలని అన్నారు.. వాలింటర్లు కరోనా కష్టకాలంలో ప్రతి ఇంటికి మందులు, మాస్కులు అందించి, ప్రజలను కష్ట కాలంలో కంటికి రెప్పలా కాపాడి, సేవ చేసిన వారిపై చంద్రబాబు కుట్రలు చేస్తున్న తీరును కూడా ప్రజలంతా గమనించాలన్నారు.. చంద్రబాబు ప్రజలను మళ్ళీ మోసం చేసేందుకు దొంగ హామీలు ఇయ్యడానికి టిడిపి వాళ్ళు ఊర్లలోకి వస్తారు కావున వారి మాటలను నమ్మొద్దు అని తెలిపారు..
అలాగే ఊర్లలో కొన్ని చోట్ల ఉన్న ఉన్న రోడ్డు, మంచినీటి లాంటి చిన్న చిన్న సమస్యలను గెలిచిన వెంటనే శాశ్వత పరిష్కరం చూపుతామన్నారు.. ఊర్లలో కక్షలు లేకుండా అందరూ సుఖశాంతులతో ఉండేలా చూస్తామన్నారు.. అలాగే ఎవరికైనా హాస్పిటల్ సమస్యలు ఉంటే తనను అర్థరాత్రైనా నేరుగా కలువవచ్చని, తాను ‘ప్రతి పేదవాడి ఇంటికి డాక్టర్ని అవుతా’ అని, విద్యార్థులు ఉన్నతంగా చదివేలా వారిలో నైపుణ్యాన్ని వెలికితీసే కార్యక్రమాలు చేపట్టుతూ, పాఠశాలలను, విద్యార్థులను దత్తగా తీసుకుంటానని డా.అదిమూలపు సతీష్ హామీ ఇచ్చినారు..
రానున్న మే13నాడు జరగనున్న ఎలక్షన్ లో ఎమ్మెల్యేగా డా.ఆదిమూలపు సతీష్ గారికి, ఎంపీ గా బివై రామయ్య గారికి రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తుపై ఓటువేసి గెలిపించాలని అభ్యర్థించారు.
ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ సోమశేఖర రెడ్డి, jcs కన్వీనర్ తులసి రెడ్డి, వ్యవసాయ సలహా మండలి సభ్యుడు ప్రభాకర్ రెడ్డి, చింతమానిపల్లె సర్పంచ్ మహానంది, టి జీ వెంకటేష్, రామచంద్ర రెడ్డి, పొలకల్ ప్రభాకర్ రెడ్డి, కో ఆప్షన్ నెంబర్ హారున్,గుడిపాడు లక్ష్మికాంతారెడ్డి, రాంమోహన్ రెడ్డి, ఎల్లమ్మ టెంపుల్ చైర్మన్ మహేశ్వర రేడిసి, భాను ప్రకాష్ రెడ్డి, తిమ్మదొడ్డి ఉప సర్పంచ్ రఘు, యనగండ్ల సర్పంచ్ ఇమ్మానియేల్, కంపాడు కరుణాకర్ రెడ్డి, పోలకల్ పులి రాజు, సి బెలగల్ మల్లికార్జున్ రెడ్డి, సి బెలగల్ సర్పంచ్ పాండురంగన్న, రంగాపురం శంకర్ రెడ్డి, ఈర్లదిన్నె నాగేశ్వర్రెడ్డి, రంగాపురం మనోహర్ రెడ్డి, బాయికాటి మద్దిలేటి, చాకలి రామకృష్ణ, ముందరింటి గోపాల్, శేషి రెడ్డి, ముడుమల రవి రెడ్డి, ఈశ్వరయ్య, వైస్ ఎంపీపీ బిసమ్మ, మాజీ సర్పంచ్ రాఘవేంద్ర, ముడుమాల మద్దిలేటి, బురాన్ దొడ్డి గోవర్ధన్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, గొల్లలదొడ్డి రంగారెడ్డి, మాజీ సర్పంచ్ కంపాడు రామాంజనేయులు, కంపాడు నరసింహుడు, నాయకులు, కార్యకర్తలు, మహిళలు, అభిమానులు, శ్రేయోభిలాషులు తదితరులు పాల్గొన్నారు.






