kiran24×7news :-
కర్నూలు నగరం వెంకటరమణ కాలనీలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు కోడుమూరు నియోజకవర్గం కోడుమూరు మండలం బైన్ దొడ్డీ గ్రామానికి చెందిన వైసీపీ పార్టీ నాయకుడు బోయ వీరేంద్ర Boya Veerendra ఆధ్వర్యంలో గ్రామానికి చెందిన వైసీపీ పార్టీ నాయకులు పెద్ద హనుమంతు, పులేరు, శేఖర్, ఊరుకుందు,నరసింహ,వీరేంద్ర,రాము, నాయుడు,ఇంద్ర,శంకర్,రామకృష్ణ,ఈరన్న,చిన్న జమన్న తదితరులు ఈరోజు వైసీపీ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలోకి చేరిపోయారు.

వీరందరికీ కాంగ్రెస్ పార్టీ కోడుమూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి,మాజీ ఎమ్మెల్యే,మాజీ టీటీడీ పాలకమండలి సభ్యులు శ్రీ,,పరిగెల మురళీకృష్ణ అన్న Muralikrishna Parigela గారు కండువా కప్పి కాంగ్రెస్ పార్టీ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్బంగా కాంగ్రెస్ పార్టీలో చేరిన తరువాత బైన్ దొడ్డి గ్రామస్తులు మాట్లాడుతూ పరిగెల మురళీ కృష్ణ అన్న గారు ఎటువంటి సమయంలోనైన ఆపద ఉందని చెబితే క్షణం కూడా ఆలోచించకుండా పలికే నాయకడని ఇటువంటి నాయకుడి మనమందరం అండగా ఉండి గెలిపించుకుంటే నియోజకవర్గ ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని ఈ సందర్భంగా వారు తెలిపారు.






