kiran24×7news :  *ఘనంగా మహాత్మ జ్యోతిరావు పూలె జయంతి* ఈరోజు కోడుమూరు కె.ఈ. రాంబాబు కాంప్లెక్స్ mrps కార్యాలయం నందు, msp రాష్ట్ర నాయకులు ఆంధ్రయ్య ఆధ్వర్యంలో సామజిక తత్వవేత్త, ఉద్యమకారుడు, సంఘసేవకుడైనా, జ్యోతి రావ్ గోవిందరావ్ పూలె గారి జయంతి ని ఘనంగా నిర్వహించడం జరిగింది. ముందుగా మహాత్మా జ్యోతిరావ్ పూలె గారి చిత్ర పఠానికి పూలమాలవేసి నివాళులు అర్పించడం జరిగినది. ఈ సందర్భంగా ఆంద్రయ్య మాట్లాడుతూ,జ్యోతి రావ్ పూలె గారు మహారాష్ట్ర, సాతారా జిల్లాలోని మాలి కులానికి చెందిన కుటుంబంలో 1827, ఏప్రిల్ 11న జన్మించారు.అతను అంటరానితనం కులనిర్ములన తో పాటు, మహిళో ద్దరణకు కృషి చేశాడు 1873 సెప్టెంబర్ 24న పూలే తన అనుచరులతో కలిసి దిగువ కులాల ప్రజలకు సమాన హక్కులు పొందడానికి సత్యశోధక్ సమాజ్ (సొసైటీ ఆఫ్ సీకర్స్ ఆఫ్ ట్రూత్)ను ఏర్పాటు చేశారాని ఆంధ్రయ్య అన్నారు. జ్యోతి రావ్ పూలె భారత దేశంలోనే మొట్ట మొదటి భారతీయ సామాజిక సంసకర్త అని కొనియాడారు. అణగారిన వర్గాల అభివృద్ధి కోసం పనిచేసిన ఈ సంఘంలో అన్ని మతాలు, కులాల ప్రజలు కూడా చేరవచ్చు అదేవిధంగా, ఆయన భార్య సావిత్రి బాయి పూలె గ్యారు భారత దేశంలో మహిళా విద్యకు మార్గ దర్శకులని అని అన్నారు. ఇటీవంటి మహాత్ములా ఆశయాలను కొనసాగిండమే మన ముందున్న కర్తవ్యం అని అన్నారు.కార్యక్రమంలో వార్డు మెంబర్ ప్రతాప్ రెడ్డి, citu నాయకులు ఈరన్న, సామజిక కార్యకర్త రాఘవేంద్ర యాదవ్ kdc జాయింట్ సెక్రటరీ ఉసెనప్ప స్వామి, వెంకటేష్, విజయ్, నాగరాజు, ప్రవీణ్, దేవసహాయం తదితరులు పాల్గొన్నారు.