kiran24×7news : మహాత్మ జ్యోతిబాపూలే 297 వ జయంతి వేడుకలు గూడూరు నగరంలో ఘనంగా నిర్వహించినట్లు జయంతి ఉత్సవ కమిటీ సభ్యులు మాజీ జెడ్పిటిసి సభ్యులు ఎన్ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా మాజీ జెడ్పిటిసి ఎల్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ 1827 ఏప్రిల్ 11న మహారాష్ట్రలోని పూణేలో గోవిందరావు పూలే సినిమా దంపతులకు జన్మించారు మహాత్మ జ్యోతిరావు పూలే కుల నిర్మూలనకు ఎంతో కృషి చేయడం సమాజంలో అంటరానితనం దురాచారాలను రూపుమాపుటకు చదువు ఎంతో ప్రాముఖ్యమని మొదట తాను ఎంతో కష్టపడి చదువుకొని తన భార్య అయిన సావిత్రిబాయి పూలేకు చదువు నేర్పించి అంటరాని వారికి చదువు చెప్పిన మొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే ఆ కాలంలో సతీసహగమనము ఎక్కువగా జరుగుతున్న సందర్భంలో ఈ దురాచారాన్ని రూపుమాపుటకు రాజా రామ్మోహన్ రావు సంఘసంస్కర్త తోడ్పాటును తీసుకొని సమాజంలోని దురా ఆచారాలను రారా దోలుటకు కృషి చేశారని తెలిపారు.
ఇప్పటి మహానుభావులను స్మరించుకోవడం మన పూర్వజన్మ సుకృతమని తెలియజేశారు ఈ సందర్భంగా వచ్చే ఏడాది నాటికి గూడూరు పట్టణంలో జ్యోతిరావు పూలే విగ్రహ ఏర్పాటుకు నగర్ చైర్మన్ పాలకవర్గము స్థల పరిమిషన్ ఇవ్వాలని జయంతి సందర్భంగా నగర పంచాయతీ చైర్మన్ జులపాల వెంకటేశ్వర్లుకు విన్నవించగా కచ్చితంగా స్థలము విగ్రహం కొరకు కావాలంటే కేటాయించుటకు అనుకూలంగా ఉన్నామని నగర పంచాయతీ చైర్మన్ జులపాల వెంకటేశ్వర్లు తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా దళిత సామాజిక ఉద్యమ నాయకులు బి సుధాకర్ కౌన్సిలర్ దస్తగిరి విజయ్ దళిత నాయకులు ప్రవీణ్ కే రవి ప్రతాప్ పి మధుసూదన రావు ఎస్సీ భాస్కర్ టిఎస్ రాజు బి ప్రభాకర్ ఎస్ దేవదాసు ఎస్ సూరి బి యాకోబు ఉగ్ర నరసింహులు కే వెంకటేశ్వర్లు సంజీవయ్య నగర్ గిడ్డయ్య పాముల గిడ్డయ్య బి బొజ్జప్ప బెలగల్ నాగేష్ బెక్కం మనోహర్ రంగన్న తదితరులు పాల్గొన్నారు.






