కిరణ్ 24×7 న్యూస్: గూడూరు పట్టణంకు చెందిన దాదాపు 150 మంది మైనారిటీ సోదరులు రంజాన్ సందర్భంగా ప్రత్యేక ప్రార్థన నిర్వహించుకొని తధనంతరం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి గారిని వారి నివాసంలో కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలుపుతామని హామీ ఇస్తూ వారి సమస్యలను విష్ణువర్ధన్ రెడ్డి గారికి దృష్టికి తీసుకెళ్లారు. విష్ణువర్ధన్ రెడ్డి గారు బలపరిచిన బొగ్గుల దస్తగిరి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామని హామీ ఇచ్చారు..
విష్ణువర్ధన్ రెడ్డి గారు మాట్లాడుతూముందుగా మైనార్టీ సోదరులకు శుభాకాంక్షలు తెలుపి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే మీ సమస్యలు త్వరిగతన పూర్తి పూర్తి చేస్తామని, తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడు మైనార్టీ సోదరులకు అండగా ఉంటుందన్నారు.
ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ బుడ్డంగిలి కోడుమూరు షాషావలి, మైనార్టీ సెల్ పార్లమెంట్ కార్యదర్శి మాన్నాన్ భాష, మత పెద్ద యూసబ్ మియ,చికెన్ వాయిద్, తిమ్మందొడ్డి బడేస,ఇబ్రహీం,షేక్షావలి, ఎలక్ట్రిషన్ ఖాజా, రెహమాన్, యూసఫ్, అబ్దుల్ రావుస్, డాక్యుమెంట్ వలి, అబ్జద్ భాష,పౌలు, గాటా షరీఫ్,భాషా, డిఎస్ ఖలీల్, అద్దు, నత్తి గౌండ రెహమాన్ హజిమ్ బాషా తదితరులు పాల్గొన్నారు.






