కిరణ్ 24×7 న్యూస్
కర్నూలు మండలం అంబేద్కర్ నగర్ దిన్నదేవరపాడు గ్రామంలో ఇంటింటికీ ప్రచారం లో పాల్గొన్న కుడా చైర్మన్ కోట్ల హర్షవర్ధన్ రెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యే మణి గాంధీ గారు, ఎంపీ అభ్యర్థి బివై రామయ్య గారు, మరియు కోడుమూరు ఎమ్మెల్యే అభ్యర్థి డా.ఆది మూలపు సతీష్ గారు..
ప్రచారానికి విచ్చేసిన కుడా చైర్మన్ కోట్ల హర్షవర్ధన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మణిగాంధీ, ఎంపీ అభ్యర్థి బివై రామయ్య, కోడుమూరు ఎమ్మెల్యే అభ్యర్థి డా.ఆదిమూలపు సతీష్ గార్లను దిన్నదేవరపాడు గ్రామ పార్టీ నాయకులు, గ్రామస్థులు, యువకులు పటాసులు పేల్చి, నాయకులకు పూలమాలలు వేసి ఘనంగా గ్రామంలోకి స్వాగతం పలికారు..
ఈ సందర్భంగా కుడా చైర్మన్ కోట్ల హర్షవర్ధన్ రెడ్డి ఎంపీ అభ్యర్థి బివై రామయ్య ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిమూలపు సతీష్ లు మాట్లాడుతూ ప్రతి ఇంటికి లబ్ది చేకూరుతేనే వైసీపీకి ఓటు వేయాలని చెప్పిన దమ్మున్న నాయకుడు, రాష్ట్రంలో ఏకైక నాయకుడు జగనన్న మాత్రమే అని అన్నారు.. ప్రభుత్వం పేద ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అందించారని, అర్హులైన లబ్దిదారులకు ఇంటి గడప వద్దకే ప్రతి నెల పెన్షన్ డబ్బులు అందించి వృద్ధులకు, వింతంతువులకు, వికలాంగులకు అండగా నిలిచింది జగన్ గారు మాత్రమే అని అన్నారు.. జగనన్న ప్రభుత్వం ద్వారా అన్ని వర్గాల ప్రజలు కులాలకు, మతాలకు అతీతంగా సుఖసంతోషాలతో ఉన్నారన్నారు.. చంద్రబాబు, కూటమి నాయకులు ఎన్ని కుట్రలు చేసిన, ఎన్ని దొంగ మాటలు చెప్పిన రానున్నది జగన్ గారి ప్రభుత్వమే అని ధీమా వ్యక్తం చేశారు.. ఊర్లలో ఏదైతే చిన్న చిన్న సమస్యలు ఉన్నాయో వాటిని గెలిచిన వెంటనే పరిష్కరిస్తామని అన్నారు.. జగనన్న ప్రభుత్వంలో గ్రామాల్లో కక్షలు, గొడవలు లేకుండా సుఖసంతోషాలతో ఉన్నారన్నారు.. ప్రజసౌమ్యన్ని కుని చేస్తున్న చంద్రబాబు కు ప్రజలు ఓట్లతో బుద్ధిచెప్పాలని పిలుపునిచ్చారు.. జగనన్న ప్రభుత్వంలో పల్లెలు పట్టణాలు అభివృద్ధి చెందాయని ప్రతి కుటుంబం ఆర్ధికంగా ఎదిగిందని అన్నారు.రానున్న మే13వ తేదీన జరగనున్న ఎలక్షన్ లో ఎంపీగా బివై రామయ్య గారికి, ఎమ్మెల్యే గా డా.ఆది మూలపు సతీష్ గారికి ఓట్ల వేసి గెలిపించాలని ప్రజలను కోరారు..
ఈ కార్యక్రమంలో జడ్పిటిసి ప్రసన్నకుమార్, మండల కన్వీనర్ మహబూబ్ బాషా, రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరెడ్డి, మాజీ సర్పంచ్ పెరుగు శ్రీధర్ రెడ్డి, ఎంపిటిసి రామ్నాథ్ రెడ్డి, హరినాథ్ రెడ్డి, అఖిలేష్ రెడ్డి, శేషి రెడ్డి, ఎంపీటీసీ శేఖర్, వెంకయ్య పల్లి ఎల్లమ్మ దేవాలయం చైర్మన్ మహేశ్వర్ రెడ్డి, ఎంపీటీసీ హనుమంతు, ఉల్చాల విష్ణువర్ధన్ రెడ్డి, గొందిపర్ల సర్పంచ్ శ్రీనివాసులు, మాజీ ఎంపీటీసీ చిన్న లక్ష్మన్న, మహానంది రెడ్డి, అమర్నాథ్ రెడ్డి, వైఎస్ఆర్సిపి జిల్లా కార్యదర్శి బోయ వెంకటేష్, గొందిపర్ల గోపాల్, ఎస్సీ సెల్ జాయింట్ సెక్రెటరీ ప్రసాద్, వైసిపి ట్రేడింగ్ యూనియన్ జిల్లా కార్యదర్శి ఆదాం, ఎల్లమ్మ దేవాలయం బోర్డు నెంబర్ మధు శేఖర్, ఈశ్వరయ్య, చిన్న ఆదిశేషులు, రామరాజు, గోపాల్, కృష్ణ, మోహన్ బాబు, కేశవరెడ్డి, బొజ్జన్న, ప్రభుదాస్, దావీదు, దామోదర్ నాయుడు, మౌలాలి, పింజరి మౌలాలి, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు శ్రేయోభిలాషులు తదితరులు పాల్గొన్నారు.






