కిరణ్ 24×7 న్యూస్:

కోడుమూరు నియోజకవర్గం కర్నూలు రూరల్ మండలం పరిధిలోని *ఉల్చాల గ్రామానికి కాలనీకి చెందిన వైసీపీ పార్టీ నాయకులు నారాయణ,వెంకటేష్,సుధాకర్, అంజి,మధు,మహేష్,సురేంద్ర,తిరుపాలు,శ్రీరాములు,అరవింద్* తదితరులు ఈరోజు వైసీపీ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు.వీరందరికీ  కాంగ్రెస్ పార్టీ కోడుమూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి,మాజీ ఎమ్మెల్యే,మాజీ టీటీడీ పాలకమండలి సభ్యులు శ్రీ,,పరిగెల మురళీకృష్ణ గారు కాంగ్రెస్ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు..

ఈ సందర్బంగా ఉల్చాల గ్రామస్తులు మాట్లాడుతూ కోడుమూరు నియోజకవర్గంలో ఏ సమయంలోనైన పిలిస్తే పలికే నాయకుడు ఎవరైన ఉన్నారా అంటే అది కేవలం శ్రీ మురళీకృష్ణ గారేనని ఇటువంటి నాయకుడిని గెలిపించుకుంటే నియోజకవర్గం అభివృద్ధి సాధించడం ఖాయమని పార్టీలకు అతీతంగా అందరం కలిసి శ్రీ పరిగెల మురళీకృష్ణ గారిని కలిసికట్టుగా పనిచేసి గెలిపించుకుందామని వారు తెలిపారు..