kiran24×7news :
సి.బెళగల్ మండలం కొత్తకోట గ్రామంలో వైఎస్ఆర్ సిపి ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులకు ఓటు వేయాలని ఇంటింటికి ప్రచారం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే కొత్తకోట ప్రకాష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మణిగాంధీ, ఎంపీ అభ్యర్థి బివై రామయ్య, కోడుమూరు ఎమ్మెల్యే అభ్యర్థి డా.ఆదిమూలపు సతీష్ గారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రతి ఇంటికి లబ్ది చేకూరుతేనే వైసీపీకి ఓటు వేయ్యండి అని పిలుపునిచ్చారు.. జగనన్న ప్రభుత్వం పేద ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అందించారని, అర్హులైన లబ్దిదారులకు ఇంటి గడప వద్దకే ప్రతి నెల పెన్షన్ డబ్బులు అందించి వృద్ధులకు, వింతంతువులకు, వికలాంగులకు అండగా ఉన్నామన్నారు.. జగనన్న ప్రభుత్వం ద్వారా అన్ని వర్గాల ప్రజలు కులాలకు, మతాలకు అతీతంగా సుఖసంతోషాలతో ఉన్నారన్నారు.. చంద్రబాబు, కూటమి నాయకులు ఎన్ని కుట్రలు చేసిన, ఎన్ని దొంగ మాటలు చెప్పిన రానున్నది జగన్ గారి ప్రభుత్వమే అని ధీమా వ్యక్తం చేశారు.. జగనన్న ప్రభుత్వంలో పల్లెలు పట్టణాలు అభివృద్ధి చెందాయని ప్రతి కుటుంబం ఆర్ధికంగా ఎదిగిందని అన్నారు.. నియోజకవర్గంలో పేద వారందరికీ విద్య , వైద్యం అందేలా చూస్తామని అన్నారు.. నియోజకవర్గంలో సాగునీరు, మంచి నీరు, రోడ్లు ఇబ్బంది లేకుండా చేస్తామన్నారు.. జగనన్న ప్రభుత్వంలో చిన్న పిల్లోడి నుండి ముసలివారిదాకా ఏదో ఒక పథకం ద్వారా అందరికీ లబ్ధి చేకూరిందని అన్నారు..
రానున్న మే13వ తేదీన జరగనున్న ఎలక్షన్ లో వైసిపి ఎంపీగా బివై రామయ్య గారికి, ఎమ్మెల్యే గా డా.ఆది మూలపు సతీష్ గారికి ఓట్ల వేసి గెలిపించి, జగనన్న కు కానుకగా అందించాలని ప్రజలను కోరారు..
కార్యక్రమంలో ఎంపీపీ మునెప్ప, సర్పంచ్ బెల్లం శ్రీనివాసులు, మండల కన్వీనర్ సోమశేఖర్ రెడ్డి, ఎంపిటిసి మనీ మోహన్ రెడ్డి, ఎంపీటీసీ శోభారాణి, కంపర సత్యనారాయణరెడ్డి, నడిపి సోమన్న, సింగిల్ విండో చైర్మన్ గోపాల్ రెడ్డి, వైయస్సార్సీపీ మైనార్టీ జిల్లా కార్యదర్శి ఎస్ఎం భాష, జగదీశ్వర్ రెడ్డి, ముడుమల రవి రెడ్డి, ఈలదిన్నె నాగేశ్వర్రెడ్డి, జే సి ఎస్ మండల కన్వీనర్ తులసిరెడ్డి, సింగిల్ విండో మాజీ చైర్మన్ సిబి గోవిందరెడ్డి, బాలకృష్ణారెడ్డి, శ్రీనివాసులు, ప్రభాకర్, సోమశేఖర్, గూడూరు పట్టణ మున్సిపల్ కమిషనర్ జె వెంకటేశ్వర్లు, వైస్ చైర్మన్ అస్లాం, గూడూరు జడ్పిటిసి మౌలాలి, కర్నూలు జడ్పిటిసి ప్రసన్నకుమార్, మండల ఉపాధ్యక్షులు నెహమియా, రైతు విభజన రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరెడ్డి, వ్యవసాయ జిల్లా సహాయ సలహా మండలి సభ్యులు ప్రభాకర్ రెడ్డి, మండల ఉపాధ్యక్షులు డి వాసు, రాధాకృష్ణారెడ్డి, సత్య రెడ్డి, సంపత్ కుమార్, ఉల్చాల సర్పంచ్ విద్యాసాగర్, ట్రేడింగ్ యూనియన్ జిల్లా కార్యదర్శి ఆదాం, ఎస్సీ సెల్ జాయింట్ సెక్రెటరీ ప్రసాద్, వెంకటేశ్వర్లు, రామాంజనేయులు, మద్దిలేటి, రాజేష్, హానొక్, నాయకులు, కార్యకర్తలు, మహిళలు అభిమానులు శ్రేయోభిలాషులు పాల్గొన్నారు.








